మెగా కుర్రాడికి పెద్ద బేనర్ల సాయం

మెగా కుర్రాడికి పెద్ద బేనర్ల సాయం

వరుసగా రెండు మూడు కాదు.. ఏకంగా అరడజను ఫ్లాపులు ఎదుర్కొన్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఈ ఫ్లాపుల పరంపర నుంచి ‘చిత్రలహరి’ అతడిని బయటపడేసేటట్లే కనిపించింది. ఈ చిత్రానికి టాక్ పర్వాలేదు. ఓపెనింగ్స్ కూడా ఓకే. కానీ సినిమాకు లాంగ్ రన్ లేకపోయింది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వచ్చింది కాబట్టి దీన్ని ఫ్లాప్ అనలేం.

అలాగని హిట్ అని ట్యాగ్ ఇవ్వడానికి కూడా లేదు. కాకపోతే తేజు గత సినిమాలతో పోలిస్తే ఎంత బెటర్. దీని రిజల్ట్ పట్ల తేజు కొంచెం సంతృప్తిగానే ఉండి ఉంటాడు. తేజ అరడజను ఫ్లాపుల్లో ఉన్న సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ అతడితో ‘చిత్రలహరి’ తీయడం విశేషమే. రామ్ చరణ్‌ తేజ్‌తో ‘రంగస్థలం’ తీసి మెగా ఫ్యామిలీతో అటాచ్మెంట్ం పెంచుకున్నారు మైత్రీ అధినేతలు. త్వరలో అల్లు అర్జున్‌‌తోనూ ఓ సినిమా తీయబోతున్నారు. మెగా ఫ్యామిలీతో ఈ సాన్నిహిత్యంతోనే తేజు కోసం ఓ సినిమా చేసి పెట్టారు.

ఇదే కోవలో మరో పెద్ద సంస్థ తేజును టేకప్ చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సంస్థే యువి క్రియేషన్స్. మారుతి దర్శకత్వంలో తేజు చేయబోయే కొత్త సినిమాను ఈ బేనర్ మీదే ప్రొడ్యూస్ చేయనున్నారట. మీడియం బడ్జెట్లో సినిమా చేయడానికి ప్రణాళికలు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు సెట్ కావడంలోనూ మెగా ఫ్యామిలీ సపోర్ట్ కీలకమే. ఈ సంస్థకు ముందు నుంచి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. అల్లు అరవింద్‌తో కలిసి సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసిందీ సంస్థ.

ఫ్లాపుల్లో ఉన్న తేజును అరవిందే తన చేతికి తీసుకుని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడని ఒక దశలో ప్రచారం జరిగింది. అది కుదరకపోయినా ఆయనే దగ్గరుండి మంచి బేనర్లలో తేజుకు సినిమాలు సెట్ చేయిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ‘శైలజారెడ్డి అల్లుడు’తో కంగుతిన్న మారుతి.. ఈసారి తాను హిట్ కొట్టడంతో పాటు తేజుకు కూడా మంచి విజయాన్ని అందించాలనే పట్టుదలతో ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English