అల్లు అరవింద్‌తో ‘గొడవ’పై బన్నీ ఏమన్నాడంటే..

అల్లు అరవింద్‌తో ‘గొడవ’పై బన్నీ ఏమన్నాడంటే..

అల్లు అరవింద్‌కు, అల్లు అర్జున్‌కు విభేదాలు నెలకొన్నాయట. ఇద్దరికీ పడటం లేదట. సినిమాల విషయంలో ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయట.. ఈ మధ్య మీడియాలో ఇలాంటి వార్తలు కొన్ని హల్ చల్ చేశాయి. ఈ విషయమై ఓ గల్ఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ స్పందించడం విశేషం.

తన తండ్రితో తనకు గొడవ అంటూ వస్తున్న వార్తల గురించి బన్నీ స్పందిస్తూ.. ‘‘మా నాన్నకు నాకు పడటం లేదని.. మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని ఈ మధ్య వార్తలు చదివా. నేను, నాన్న ఒకే ఇంటిలో ఉంటున్నాం. రెగ్యులర్‌గా బోలెడన్ని విషయాలపై డిస్కస్ చేస్తుంటాం. అలాంటి మా మధ్య గొడవలేంటి. ఈ వార్తలు చూసి నవ్వుకున్నాం. ఫన్నీగా అనిపించాయి’’ అని బన్నీ చెప్పాడు.

ఇక ఈ ఇంటర్వ్యూలో ఇంకొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు బన్నీ. కొన్నిసార్లు తన గురించి తాను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తుంటానని.. గత సినిమాల్లో లుక్స్ రిఫర్ చేయడానికి, ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి గూగుల్లో తనను తాను వెతుక్కుంటానని బన్నీ చెప్పాడు. తాను సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చా కాబట్టి తన విషయంలో నెపోటిజం ఉన్నట్లే అని.. కానీ దాన్నుంచి తాను దూరంగా వెళ్లలేనని.. నెపోటిజం ఉన్నా లేకున్నా అంతిమంగా టాలెంటే మాట్లాడుతుందని.. ప్రతిభ ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో మనుగడ సాధించగలరని బన్నీ అన్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుందా అని బన్నీని అడిగితే.. ఆ విషయం తాను ఇప్పుడు చెప్పలేనని, ఈ సినిమాలో చాలా సర్ప్రైజులు మాత్రం ఉంటాయని, సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని మాత్రం గ్యారెంటీ ఇవ్వగలనని బన్నీ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English