శ్రద్దా శ్రీనాథా మజాకా!

శ్రద్దా శ్రీనాథా మజాకా!

సమంత సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్. ఆమె ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి హీరోయిన్ గురించి ఈ మధ్య శ్రద్ధ శ్రీనాథ్ అనే కొత్తమ్మాయి చేసిన కామెంట్ మన జనాలకు పెద్ద షాకే ఇచ్చింది. శ్రద్ధ కథానాయికగా పరిచయం అవుతూ కన్నడలో చేసిన ‘యు టర్న్’ సినిమానే సమంత ప్రధాన పాత్రలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

‘జెర్సీ’ ప్రమోషన్లలో భాగంగా తెలుగు ‘యు టర్న్’ చూశారా అని అడిగితే.. అరగంట చూసి ఆపేశానని.. ఆ పాత్రలో తానే ది బెస్ట్ అనుకుంటున్నానని.. మరొకరిని అందులో చూడలేకపోయానని షాకింగ్ కామెంట్ చేసింది శ్రద్ధ. ఒక కొత్తమ్మాయి నుంచి ఇలాంటి కామెంట్ ఇక్కడి జనాలు ఊహించలేదు. ఐతే తనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేసినా శ్రద్ధ పట్టించుకోలేదు. ఆపై ‘జెర్సీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో శ్రద్ధ మాట్లాడిన తీరు కూడా చాలామందికి షాకింగ్‌గాననే అనిపించింది. ఆమె లేడీ విజయ్ దేవరకొండలాగా అనిపించింది.

తాజాగా శ్రద్ధకు సంబంధించిన ఒక వీడియో చూస్తే ఆమె యాటిట్యూడే వేరనే విషయం అర్థమవుతోంది. ఆమె స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని తన జుట్టును సరి చేసుకుంటూ క్లిప్ పెట్టుకుంటున్న ఒక వీడియోను ఆమె షేర్ చేసింది. ఐతే సాధారణంగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు పెట్టినపుడు కొందరు నెటిజన్ల దృష్టి ఎక్కడో ఉంటుంది. వల్గర్ కామెంట్లు చేస్తారు. అవి ఎలా ఉంటాయో శ్రద్ధకు బాగానే తెలిసినట్లుంది. తాను ఇలా జుట్టు సరి చేసుకుంటున్నపుడు కొందరు తన అండర్ ఆర్మ్స్‌ను చూసి చాలా ఇష్టపడతారని.. అలాంటి వాళ్లు ఎంజాయ్ చేసుకోండని ఆమె కామెంట్ చేయడం గమనార్హం. దీన్ని బట్టే శ్రద్ధ ఎలాంటి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో ఇలా బోల్డ్‌గా మాట్లాడే హీరో హీరోయిన్లనే జనాలు బాగా ఇష్టపడతారు. ఈ అమ్మాయి మన విజయ్ దేవరకొండతో ఒకసారి జోడీ కడితే ఇద్దరూ కలిసి తమ యాటిట్యూడ్‌తో జనాలకు పిచ్చెక్కించేస్తారేమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English