మహేష్‌కి సారీ చెప్పిన దిల్‌ రాజు

మహేష్‌కి సారీ చెప్పిన దిల్‌ రాజు

మహేష్‌తో మహర్షిని అశ్వనీదత్‌, పివిపితో సంయుక్త నిర్మాణంలో నిర్మించిన దిల్‌ రాజు సూపర్‌స్టార్‌ తదుపరి చిత్రానికి కూడా నిర్మాణ భాగస్వామిగా వుంటాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అనిల్‌ సుంకరతో అనిల్‌ రావిపూడి సినిమా ఓకే చేసిన మహేష్‌ ఈ చిత్రానికి దిల్‌ రాజుని కూడా భాగస్వామిగా వుండాలని కోరాడు. అయిష్టంగానే మహేష్‌ కోసమని ఈ చిత్రానికి భాగస్వామ్యం తీసుకోవడానికి దిల్‌ రాజు అంగీకరించాడు. అనిల్‌ రావిపూడితో, మహేష్‌తో చెరో ఒక చిత్రం చేయడానికి ఒప్పందాలు చేసుకున్న దిల్‌ రాజుకి ఇలా భాగస్వామ్యం వల్ల రెండు సినిమాల డీల్స్‌కి ముప్పు వస్తుందని తెలిసినా కానీ మహేష్‌ కోసమని రాజీ పడడానికి సరే అన్నాడు.

కానీ 'మహర్షి' చిత్రం విడుదలకి దగ్గర పడేకొద్దీ ఇద్దరు, ముగ్గురు కలిసి సినిమా తీస్తే ఎలా వుంటుందనేది దిల్‌ రాజుకి తెలిసి వచ్చింది. చూస్తూ, చూస్తూ మరోసారి ఆ తలనొప్పి పెట్టుకోవడం ఇష్టం లేక మహేష్‌ని కలిసి అనిల్‌ సుంకరతో కలిసి పని చేయలేనని దిల్‌ రాజు చెప్పాడట. మరోవైపు అనిల్‌ సుంకర కూడా ఈ చిత్రాన్ని భాగస్వామ్యంలో కంటే సోలోగా చేస్తేనే తన అప్పుల నుంచి బయటపడవచ్చునని అనుకుంటున్నాడట. మరి అనిల్‌ సుంకరకి సోలోగా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని మహేష్‌ అప్పగిస్తాడా లేక మరెవరైనా నిర్మాతతో జత కలుపుతాడా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English