మహేష్ స్పీచ్ కోసం ఉత్కంఠగా వెయిటింగ్

మహేష్ స్పీచ్ కోసం ఉత్కంఠగా వెయిటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అతడి కొత్త చిత్రాలకు క్రేజ్ వస్తుంటుంది. దాదాపుగా అతడి ప్రతి సినిమాకూ పాజిటివ్ బజే ఉంటుంది. కానీ ‘మహర్షి’ విషయంలో దీనికి భిన్నంగా జరుగుతోంది. గత కొంత కాలంగా నెగెటివ్ వార్తలతోనే ఈ సినిమా జనాల నోళ్లలో నానుతోంది. దేవిశ్రీ ఇచ్చిన పాటల్లో చాలా వరకు అంతంతమాత్రంగా ఉండటం.. మిగతా ప్రోమోలు కూడా అంత ఆసక్తికరంగా లేకపోవడం.. దీనికి తోడు బడ్జెట్ పెరిగిపోవడం, బిజినెస్ విషయంలో నిర్మాతల మధ్య గొడవలతో ‘మహర్షి’పై ఒక రకమైన నెగెటివిటీ చుట్టుకుంది. మహేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన తన 25వ సినిమాకు ఇలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం జరగబోయే ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ఎలా సాగుతుందనే విషయంలో అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

మామూలుగా తన సినిమాల ఆడియో, ప్రి రిలీజ్ ఈవెంట్లలో మహేష్ చాలా తక్కువ మాట్లాడుతుంటాడు. పొడి పొడిగా నాలుగు మాటలు మాట్లాడి ప్రసంగాన్ని ముగిస్తుంటాడు. కానీ ‘మహర్షి’ వేడుకలో అలా చేసే అవకాశాలు తక్కువ. ఈ సినిమా తనకు స్పెషల్. మరోవైపు దీని చుట్టూ చాలా నెగెటివిటీ, ఒక వివాదం చుట్టుకుని ఉంది. మరోవైపు మహేష్ సినిమాలంటే విపరీతంగా బడ్జెట్ పెరిగిపోయి నిర్మాతలు నట్టేట మునుగుతున్నారని ఒక కరమైన ప్రచారం కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాడేమో అని జనాలు ఆసక్తిిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు తన 25వ సినిమాను పురస్కరించుకుని తనతో పని చేసిన దర్శకులందరినీ సత్కరించబోతున్న మహేష్.. తనకు దారుణమైన డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుల విషయంలో ఎలా వ్యవహరిస్తాడు, ఏం మాట్లాడతాడు అన్న ఆసక్తి కూడా ఉంది. అసలు ‘మహర్షి’ గురించి అతనేం మాట్లాడతాడన్నది కూడా ఆసక్తికరమే. మరి చూద్దాం.. మహేష్ నోటి నుంచి ఎలాంటి పలుకులు జాలువారుతాయో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English