జూ|| ఎన్టీఆర్‌ తెచ్చిన తలపోటు!

జూ|| ఎన్టీఆర్‌ తెచ్చిన తలపోటు!

బిగ్‌బాస్‌ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆ షోని సూపర్‌హిట్‌ చేసాడు. తెలుగునాట ఈ షోకి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై మొదట్లో చాలా అనుమానాలున్నా కానీ ఎన్టీఆర్‌ హోస్టింగ్‌తో బిగ్‌బాస్‌ బ్లాక్‌బస్టర్‌ రియాలిటీ షో అయింది. అయితే అదే ఇప్పుడు స్టార్‌ మా నెట్‌వర్క్‌కి తలనొప్పిగా మారింది. ఎన్టీఆర్‌ చేసిన తర్వాత సెకండ్‌ సీజన్‌ని నాని హోస్ట్‌ చేయగా, అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. తారక్‌తో కంపేర్‌ చేస్తూ నానిని బాగా టార్గెట్‌ చేసారు. దాంతో అతను బలవంతంగా అది ఫినిష్‌ చేసుకుని బయట పడాల్సి వచ్చింది.

దీంతో ఇప్పుడు ఆ షోని హోస్ట్‌ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. నాగార్జున, వెంకటేష్‌ ఇద్దరూ కూడా చేయలేమని చెప్పడంతో విజయ్‌ దేవరకొండ లేదా రానా దగ్గుబాటిని అయినా కన్విన్స్‌ చేయాలని చూసారు కానీ వారు కూడా కుదరదని చెప్పడంతో లేడీ బాస్‌ ఎలా వుంటుందనే ఆలోచనతో అనుష్కని సంప్రదించారట. ఆమె కూడా ఆసక్తి చూపించకపోవడంతో ఈ షోకి థర్డ్‌ సీజన్‌ హోస్ట్‌ ఇంకా ఫైనలైజ్‌ అవలేదు. ఒకవైపు షెడ్యూల్‌ ముంచుకొస్తూ వుంటే ఇంకా హోస్ట్‌ డిసైడ్‌ అవకపోవడంతో స్టార్‌ మా యాజమాన్యం తల పట్టుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English