పక్క చూపులు మానేసిన నాని

పక్క చూపులు మానేసిన నాని

హీరోగా ఇప్పుడు నానికి నలభై కోట్లకి పైగానే బిజినెస్‌ చేసే సత్తా వుంది. ప్రతి సినిమాకీ పది కోట్ల వరకు పారితోషికం కూడా వస్తోంది. అయితే తనకి నచ్చిన కథలు కొన్ని తన మార్కెట్‌ అనుకూలించక చేయలేకపోవడంతో వాటిని నిర్మించాలని అనుకున్నాడు. అలానే 'అ' చిత్రం తీసి కాసిని లాభాలు కూడా పొందాడు. అటు తర్వాత మరో సినిమా ఏదీ నిర్మించని నానికి లో బడ్జెట్‌ కథలు చెప్పడానికి చాలా మంది యువ దర్శకులు వస్తున్నారట. బిజీగా వుండడంతో నిర్మాణం జోలికి వెళ్లని నాని ఇకపై తన సినిమాలకి తన బ్యానర్‌ని కూడా ఇన్‌వాల్వ్‌ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ నాని మాత్రం ప్రస్తుతానికి ఆ తలనొప్పులన్నీ వద్దనుకుంటున్నాడట. డబ్బులు మాత్రం పెట్టినా కానీ ఖచ్చితంగా తన సినిమా ప్రమోషన్లకి నాని కనీసం నెల రోజులు అయినా కేటాయించాల్సి వస్తుంది. ఏడాదికి మూడు సినిమాలు చేసే నానికి అంత సమయం కేటాయించడం జరగని పని. అందుకే మరో అయిదేళ్ల వరకు సినీ నిర్మాణానికి దూరంగా వుండాలని డిసైడ్‌ అయ్యాడట. తాను చేయతగ్గ కథ అనిపించి, నిర్మాణ పరంగా రిస్క్‌ అనిపిస్తే మాత్రం జెర్సీకి చేసినట్టుగా పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా అడుగుతాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English