దేవరకొండ దీనికి భయపడాలంటారా?

దేవరకొండ దీనికి భయపడాలంటారా?

విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రాన్ని మే 31న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజున సూర్య నటించిన 'ఎన్‌జికె' రిలీజ్‌ అవుతోందని 'డియర్‌ కామ్రేడ్‌'ని జూన్‌కి వాయిదా వేసారు. నిజానికి మే 31న వస్తే రెండు వారాల పాటు సమ్మర్‌ సెలవులని క్యాష్‌ చేసుకునే వీలుంటుంది. కానీ ఎన్‌జికెతో క్లాష్‌ వద్దనుకుని డియర్‌ కామ్రేడ్‌ వేరే డేట్‌కి వెళుతోంది. దీని వల్ల బిజినెస్‌ పరంగా ఖచ్చితంగా ఎఫెక్ట్‌ వుంటుంది. అయితే ఎన్‌జికె నిజంగా విజయ్‌ ప్లాన్స్‌ మార్చుకోవాల్సినంత క్రేజీ ప్రాజెక్టా? మల్టిపుల్‌ లాంగ్వేజ్‌ రిలీజ్‌ కోసం చూస్తోన్న విజయ్‌ దేవరకొండ తమిళ వెర్షన్‌ కోసమని డియర్‌ కామ్రేడ్‌ వాయిదా వేస్తున్నాడు. కానీ ఎన్‌జికె ట్రెయిలర్‌ చూస్తే లిమిటెడ్‌ అప్పీల్‌ వున్న పొలిటికల్‌ సినిమాలా వుంది.

ఇలాంటి చిత్రాలకి తెలుగులో అయితే అస్సలు గ్యారెంటీ లేదు. మరి దానితో క్లాష్‌ వద్దనుకుని సీజన్‌ని 'డియర్‌ కామ్రేడ్‌' వదిలేసుకోవాలా? తదుపరి చిత్రాలని కూడా తమిళంలో రెగ్యులర్‌గా విడుదల చేయాలని చూస్తోన్న విజయ్‌ దేవరకొండ ఈసారి ఖచ్చితంగా తమిళంలో గ్యారెంటీ మార్కెట్‌ కోసం చూస్తున్నాడట. అందుకే ఎలాంటి ఛాన్స్‌ తీసుకోరాదని ఎన్‌జికెతో క్లాష్‌ వద్దనే డిసైడ్‌ అయ్యాడట. ట్రెయిలర్‌ చూసిన తర్వాత దేవరకొండ అభిప్రాయం ఏమైనా మారిందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English