మహేష్‌కి తెలియాలనే దిల్‌ రాజు సైలెంట్‌

మహేష్‌కి తెలియాలనే దిల్‌ రాజు సైలెంట్‌

మహేష్‌ ఇరవై అయిదవ చిత్రాన్ని నిర్మించే అవకాశం దిల్‌ రాజునే వరించింది. వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చి, మహేష్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ని దిల్‌ రాజు సెట్‌ చేసాడు. అయితే అశ్వనీదత్‌తో చాలా కాలంగా పెండింగ్‌లో వున్న కమిట్‌మెంట్‌ కూడా ఇదే చిత్రంతో మాఫీ చేయాలని మహేష్‌ భావించాడు. అతని మాట కాదనలేక అశ్వనీదత్‌కి పార్టనర్‌షిప్‌ ఇచ్చాడు దిల్‌ రాజు. ఆ తర్వాత పైడిపల్లి తదుపరి సినిమా తనకే చేయాలంటూ పీవీపి కోర్టుకెళ్లాడు. దాంతో ముగ్గురు నిర్మాతలయ్యారు.

దిల్‌ రాజుకి ఇలాంటి జాయింట్‌ వెంఛర్లు ఇష్టం లేకపోయినా కానీ మహేష్‌ కోసం రాజీ పడ్డాడు. అయితే ఇప్పుడు ప్రతి విషయంలోను నిర్మాతల మధ్య పేచీ వస్తోందట. అశ్వనీదత్‌ అయితే దిల్‌ రాజుతో గొడవ పడ్డారని కూడా వదంతులు వస్తున్నాయి. కానీ ఇంతవరకు దిల్‌ రాజు దీనిపై స్పందించలేదు. మహేష్‌ వెనుక జరుగుతున్నది ఏమిటో అతనికి తెలియాలనే దిల్‌ రాజు సైలెంట్‌గా వుంటున్నాడని చెబుతున్నారు. దిల్‌ రాజు టీమ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటుంది. కానీ ఈ రూమర్స్‌ విషయంలో మాత్రం స్పందించకూడదని వారికి కూడా స్ట్రిక్ట్‌ ఆర్డర్లు వెళ్లినట్టు తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English