అక్కడి నుంచి లాగలేకపోతున్న నాని

అక్కడి నుంచి లాగలేకపోతున్న నాని

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘జెర్సీ’కి అదిరిపోయే టాక్ వచ్చింది. యుఎస్ ప్రేక్షకులు టాక్, రేటింగ్స్‌ను బట్టే సినిమాకు వెళ్తారు. వాళ్లు ఎక్కువగా క్లాస్, రొమాంటిక్, ఎమోషనల్ సినిమాలకు కనెక్టవుతారు. ‘జెర్సీ’లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. దీంతో దీనికి తొలి వారాంతం మంచి రెస్పాన్స్ వచ్చింది. వీకెండ్ అయ్యేసరికే 9.2 లక్షల డాలర్లు కొల్లగొట్టింది.

తర్వాతి రోజుకే మిలియన్ డాలర్ మార్కును కూడా అందుకుంది. ఈ ఊపు చూస్తే ‘జెర్సీ’ ఈజీగా 1.5 మిలియన్ డాలర్ల క్లబ్బులో కూడా చేరిపోతుందని అంచనా వేశారు. కానీ తొలి వారాంతం తర్వాత ‘జెర్సీ’ నిలవలేకపోయింది. ఇప్పటిదాకా ఈ చిత్రం 1.23 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇంకా ఈ సినిమా ముందుకు సాగేలా కనిపించడం లేదు. అక్కడ దాదాపుగా థియేట్రికల్ రన్ ముగిసినట్లే భావించాలి.

రెండో వీకెండ్ వచ్చేసరికి ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ప్రభంజనం ‘జెర్సీ’కి బ్రేకులు వేసింది. వసూళ్లు నామమాత్రం అయిపోయాయి. ఈ సినిమా అనే కాదు.. నాని చిత్రాల్ని కొంత కాలంగా గమనిస్తుంటే యుఎస్‌లో ఆరంభంలో అదరగొడుతున్నాయి. కానీ వీకెండ్ తర్వాత నిలవలేకపోతున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా అలవోకగా హాఫ్ మిలియన్ మార్కును అందుకుంటున్న నాని.. వారాంతం అయ్యాక చల్లబడిపోతున్నాడు.

‘జెర్సీ’కి అద్భుతమైన టాక్ రావడం వల్ల ఫస్ట్ వీకెండ్లోనే మిలియన్ మార్కుకు చేరువ అయిపోయింది కానీ.. లేదంటే మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం కష్టమయ్యేది. నిజానికి యుఎస్ బాక్సాఫీస్‌లో తెలుగు సినిమాల పరిస్థితి ఇలాగే తయారైంది. ఆరంభంలో ఉన్న ఊపును తర్వాత కొనసాగించలేకపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ సక్సెస్ రేట్ మరింత తక్కువగా ఉంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English