మహేష్ బాబుతో అశ్వినీదత్ అమీతుమీ?

మహేష్ బాబుతో అశ్వినీదత్ అమీతుమీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ విడుదలకు అటు ఇటుగా వారం రోజులే సమయం ఉంది. ఈపాటికి నిర్మాతలు బిజినెస్ వ్యవహారాలన్నీ పూర్తి చేసి పూర్తిగా రిలీజ్ ఏర్పాట్ల మీదే దృష్టిసారించాలి. భారీ స్థాయిలో ప్లాన్ చేసుకున్న ప్రి రిలీజ్ ఈవెంట్ మీద ఫోకస్ పెట్టాలి. కానీ వాస్తవంగా వ్యవహారం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న అశ్వినీదత్‌కు, ప్రధాన నిర్మాత అయిన దిల్ రాజుకు ఆదాయ పంపకాల విషయంలో గొడవ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

‘సైనికుడు’ సినిమాతో దత్ భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఆయనతో మరో సినిమా చేస్తానని మాటిచ్చి చాలా ఏళ్ల కిందట రూ.5 కోట్ల దాకా అడ్వాన్స్ తీసుకున్నాడట మహేష్ బాబు. కానీ ఆయనతో సినిమా సెట్ అవ్వలేదు. ఈ లోపు అడ్వాన్స్‌కు వడ్డీనే కోట్లల్లో అయింది. చాలా ఏళ్లు గడిచిపోయిన నేపథ్యంలో ఇక లాభం లేదని ‘మహర్షి’లో ఆయన్ని భాగస్వామిని చేశాడు మహేష్.

ఐతే ఏదో నామమాత్రంగా ఈ సినిమాలో భాగస్వామి అయ్యాడు కానీ.. ప్రొడక్షన్లో ఎక్కడా వేలు పెట్టలేదు దత్. మేకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండి చివరగా ఆదాయ పంపకాల దగ్గర ఆయన రంగంలోకి దిగారు. సినిమాకు ఎంత బడ్జెట్ అయింది, ఎంతకు అమ్మకాలు జరిగాయి అన్నదాంతో తనకు సంబంధం లేదని.. తన వాటా కింద తనకు రూ.10 కోట్లు రావాలని దత్ కండిషన్ పెట్టారట. ఐతే సినిమాకు బడ్జెట్ హద్దులు దాటిపోయి పెద్దగా ఆదాయం మిగలని నేపథ్యంలో రాజు అందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఆయనైతే చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది. ఐతే తనకు రాజుతో సంబంధం లేదని, ఐదు కోట్ల అడ్వాన్స్ తీసుకుని ఏళ్లకు ఏళ్లు గడిపేసిన మహేష్ బాబుతోనే అమీతుమీ తేల్చుకోవాలని దత్ ఫిక్సయినట్లు సమాచారం.

మళ్లీ మహేష్‌తో సినిమా చేసే అవకాశాలేమీ లేకపోవడంతో ఇక ఆయన సుతిమెత్తగా వ్యవహరించాలనేమీ అనుకోవట్లేదట. తన డబ్బులకు వడ్డీ కలిపి సెటిల్ చేయాలని ఆయన మహేష్‌కు తేల్చి చెప్పారని కూడా వార్తలొస్తున్నాయి. మరి మహేష్ ఆయనతో ఎలా సెటిల్ చేసుకుంటారో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English