హిజ్రా పాత్రలో మెగాస్టార్?

హిజ్రా పాత్రలో మెగాస్టార్?

సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు హిజ్రా పాత్రలో కనిపించడం అంటే షాకింగే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సాహసమే చేయబోతున్నట్లు సమాచారం. దక్షిణాదిన మోస్ట్ సక్సెస్ ఫుల్ హార్రర్ కామెడీ సిరీస్ ‘కాంఛన’లో వచ్చిన రెండో సినిమా ‘కాంఛన’ను హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని ఒరిజినల్ డైరెక్టర్ రాఘవ లారెన్సే హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. ‘కాంఛన’లో శరత్ కుమార్ పోషించిన హిజ్రా పాత్రను హిందీలో అమితాబ్ బచ్చన్‌తో చేయించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఐతే సినిమా ఏదైనప్పటికీ అమితాబ్ తన ఫ్రెంచ్ గడ్డాన్ని వదులుకోడు. మరి హిజ్రా పాత్ర చేయాలంటే ఆయన గడ్డం తీయాల్సిందే. మరి ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.

అమితాబ్ కనుక ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటే ‘కాంఛన’ రీమేక్‌కు అంతకంటే ఆకర్షణ మరొకటి ఉండదు. అమితాబ్ ఈ సినిమా ఒప్పుకున్నాడంటే లారెన్స్‌‌కు ఇంతకంటే కెరీర్లో పెద్ద ఛాన్స్ ఉండదు. ఇక్కడ లారెన్స్ చేసిన పాత్రను అక్షయ్ కుమార్ చేయబోతున్నాడు. అతడికి బాగా సూటయ్యే పాత్రే అది. అక్షయ్‌కు జోడీగా కియారా అద్వానీ నటించనుంది. ఈ చిత్రానికి హిందీలో ‘లక్ష్మీబాంబు’ అనే పేరు కూడా ఖరారు చేశారు. బాలీవుడ్ శైలికి తగ్గట్లుగా కొంచెం క్లాస్ టచ్ ఇచ్చి ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. కథలో కూడా కొంచెం మార్పులు చేర్పులు చేస్తారట. లారెన్స్‌కు హిందీ రాకపోయినప్పటికీ.. అక్షయ్ పట్టుబట్టి అతడితో ‘కాంఛన’ను రీమేక్ చేయిస్తున్నాడు. భారీ బడ్జెట్లో ఈ సినిమాను రిచ్‌గా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English