అంకుల్సూ, అబ్బాయిలూ ఆమె వెంటే..!

అంకుల్సూ, అబ్బాయిలూ ఆమె వెంటే..!

కొత్త హీరోయిన్‌ ఫీల్డులోకి వచ్చిందంటే యువ హీరోల చిత్రాలకి ఒక ఆప్షన్‌ లభించినట్టే తప్ప సీనియర్‌ హీరోలకి మాత్రం ఎప్పటిలానే హీరోయిన్ల కొరత వుంటుంది. కానీ తెలుగు చిత్ర సీమకి కొత్తగా వచ్చిన ఓ హీరోయిన్‌ ఇటు అబ్బాయిలతో పాటు అటు అంకుల్స్‌కి కూడా సరిజోడీ అనిపించుకునేలా వుంది. జెర్సీతో పరిచయం అయిన శ్రద్ధా శ్రీనాధ్‌కి అటు కుర్రాళ్ల సినిమాల నుంచి మాత్రమే కాకుండా సీనియర్‌ హీరోల చిత్రాలకి కూడా సీరియస్‌గా ఆఫర్లు ఇస్తున్నారు.

శ్రద్ధ వయసు తక్కువే అయినా కానీ మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది కనుక సీనియర్ల పక్కన కూడా సూట్‌ అయిపోతుందని అనుకుంటున్నారు. అందులోను జెర్సీ చిత్రంలో ఆమె యంగ్‌ క్యారెక్టర్‌లో కాకుండా బిడ్డ తల్లిగా నటించడంతో ఆమెకి వచ్చిన ఇమేజ్‌ కూడా సీనియర్‌ హీరోల పక్కన నటించడానికి పనికొస్తుందని భావిస్తున్నారు. మరోవైపు నాని యువ హీరోనే కనుక, శ్రద్ధ వయసు కూడా తక్కువే కనుక ఆమె టాలెంట్‌ అక్కరకు వస్తుందంటూ యువ హీరోల చిత్రాలకి కూడా ఆమెని కన్సిడర్‌ చేస్తున్నారు. అయితే అటు, ఇటు వచ్చి పడుతోన్న ఈ అవకాశాల్లో శ్రద్ధ ఎటువైపు మొగ్గుతుందనేది ఆసక్తికరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English