వీళ్ల కెమిస్ట్రీ చాలు.. వేరే ప్రమోషన్ పన్లేదు

వీళ్ల కెమిస్ట్రీ చాలు.. వేరే ప్రమోషన్ పన్లేదు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఇప్పుడు సౌత్ ఇండియాలో వీళ్లకంటే పర్ఫెక్ట్ జోడీ మరొకటి లేదేమో. ‘గీత గోవిందం’ సినిమా అంత పెద్ద హిట్ కావడంలో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వీళ్ల కెమిస్ట్రీ ఒక ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ‘గీత గోవిందం’ సినిమా విడుదలకు ముందు వీళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేవలం ట్విట్టర్‌ను ఉపయోగించుకుని వీళ్లిద్దరూ తమదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేశారు. విజయ్, గీతల గిల్లికజ్జాలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాను నిరంతరం వార్తల్లో నిలబెట్టాయి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా వీళ్లు మామూలుగా హల్ చల్ చేయలేదు. రిలీజ్ తర్వాత కూడా అదే హంగామా నడిచింది.

దీని తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ విషయంలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ మరింతగా ఆకట్టుకుంటోంది. ‘గీత గోవిందం’ సమయంలో రష్మిక వేరే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. కానీ ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి ఫ్రీ బర్డ్ అయిపోయింది. ఇక ఆమెకు ఏ రిస్ట్రిక్షన్స్ కూడా లేకపోయాయి. స్వేచ్ఛగా విజయ్‌తో లిప్ లాక్ లాగించేసింది. టీజర్‌కు ఆ ముద్దే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్లో విజయ్, రష్మికల మధ్య సాగుతున్న సంభాషణ కావచ్చు.. ఇద్దరూ ఒకరి ఫొటోలు ఒకరు తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం కావచ్చు.. ఇలా ప్రతి విషయంలోనూ విజయ్, రష్మిక జోడీ కెమిస్ట్రీ జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. తమ సినిమా గురించి జనాలు చర్చించుకునేలా చేస్తోంది. ఇలా ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఇంతగా కెమిస్ట్రీ పండిస్తున్న జంట మరొకటి కనిపించదు. ‘డియర్ కామ్రేడ్’ కూడా హిట్టయితే ఈ జోడీపై అంచనాలు మరింత పెరిగిపోయి.. త్వరలోనే ఈ కాంబినేషన్లో మరో సినిమా మొదలవుతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English