మహేష్ కొత్త సినిమా టైటిల్ అదేనా?

మహేష్ కొత్త సినిమా టైటిల్ అదేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ ఇంకో రెండు వారాల్లోపే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. దీని తర్వాత అతను అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అప్పుడే ఒక ఆసక్తికర టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది. ఆ టైటిల్.. 'సరిలేరు నీకెవ్వరూ'. స్టార్ హీరోలకు భలేగా నప్పే టైటిల్ ఇది. హీరోయిజం ఎలివేషన్‌కి బాగా పనికొచ్చే టైటిల్ కూడా. ప్రస్తుతం ఈ టైటిల్ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతోంది. మా మహేష్‌కు నిజంగానే ఎవ్వరూ సరి రారు.. ఇది సూపర్ స్టార్‌కు పర్ఫెక్ట్ టైటిల్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే ఈ టైటిల్ మహేష్ సినిమాకు ఖరారు చేస్తారేమో చూడాలి.

సుకుమార్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమాను ప్లాన్ చేసుకుని.. అనుకోని కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసుకుని.. ‘ఎఫ్-2’తో ఘనవిజయం సాధించిన అనిల్ రావిపూడితో జట్టు కడుతున్నాడు మహేష్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తారని అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక కథానాయికగా నటించే అవకాశాలున్నాయి. విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తుందని.. ఆమె పారితోషకం రూ.2 కోట్లని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. మహేష్‌కు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్‌తో టెంప్టింగ్ ఆఫర్ ఇవ్వడంతో ఈ సినిమాను హడావుడిగా ఒప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాను తక్కువ రోజుల్లో.. మీడియం బడ్జెట్లో పూర్తి చేసి, పెద్ద రేంజిలో బిజినెస్ చేసుకుని లాభాలు అందుకోవాలన్నది నిర్మాతల ప్లాన్. వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకునే అవకాశఆలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English