బాలకృష్ణ తీరు ఏమీ మారలేదు!

బాలకృష్ణ తీరు ఏమీ మారలేదు!

బాలకృష్ణకి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం వుండాలి. ఆయన ఖాళీగా కూర్చోవడానికి అసలు ఇష్టపడరు. అందుకే ఆయనతో ఒక్కసారి ఓకే చేసుకున్న తర్వాత దర్శకులకి ఎక్కువ సమయం దొరకదు. అలా తొందరపడడం వల్ల 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ మిస్‌ఫైర్‌ అయిందనే విమర్శలు రావడంతో తదుపరి చిత్రం విషయంలో బాలయ్య కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారని వార్తలొచ్చాయి. బోయపాటితో తదుపరి చిత్రం చేయాలని ఫిక్స్‌ అయిన బాలకృష్ణ అతనికి తగినంత సమయం ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారని అన్నారు.

అయితే కేవలం ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే బాలకృష్ణ సినిమాలకి స్వల్ప విరామం ప్రకటించారు. తాను ప్రచారం పూర్తి చేసుకుని వచ్చేలోగా బోయపాటి సిద్ధంగా వుంటాడని అనుకున్నారు. కానీ అతనేమో తెలుగుదేశం పార్టీ యాడ్స్‌ చేసే పనిలో బిజీగా వుండి బాలయ్య సినిమాకి కథ ఇంకా తయారు చేయలేదు. అసలే వినయ విధేయ రామ తర్వాతి సినిమా కనుక బోయపాటి అంత త్వరగా కథ రాసేయాలనుకోడు. అలా అని అతని కోసం వేచి చూసే తత్వం బాలయ్యకి లేదు. అందుకే తాను అనుకున్న సినిమా మొదలు కావడం లేదని మరో సినిమా లైన్లో పెట్టేసారు. బాలయ్యతో సినిమా అంటే ఉరుకులు పరుగుల మీద కథ సిద్ధం కావాలి కానీ తీరికగా కథ రాస్తానంటే ఆయన ఖాళీగా వుండాలిగా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English