పవన్‌ స్థానం బన్నీ తీసుకున్నాడా?

పవన్‌ స్థానం బన్నీ తీసుకున్నాడా?

పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ మధ్య ఎంతటి సన్నిహిత సంబంధాలుంటాయనేది అందరికీ తెలిసిందే. ఎక్కడికైనా ఇద్దరు మిత్రులు కలిసి వెళ్లేవారు. షూటింగ్స్‌ లేనపుడు ఇద్దరూ గంటల తరబడి చర్చించుకుంటూ వుంటారు. పవన్‌తో అంత క్లోజ్‌ అయిన దర్శకుడు ఇంకొకరు లేరని అంటారు. త్రివిక్రమ్‌ అంటే అల్లు అర్జున్‌కి కూడా గౌరవభావమే. అల్లు అర్జున్‌కి ఫ్యామిలీస్‌లో బేస్‌ పెంచిన దర్శకుడిగా అతనికి అల్లు కాంపౌండ్‌లో చాలా వెయిట్‌ ఇస్తుంటారు. పవన్‌ రాజకీయాలతో బిజీ అయిన తర్వాత త్రివిక్రమ్‌ ఇక అటుగా వెళ్లడం లేదు.

పవన్‌ ప్రస్తుతం సినిమా వ్యవహారాలకి దూరంగా వుండడం, త్రివిక్రమ్‌కి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవడంతో ఇప్పుడు త్రివిక్రమ్‌ ఫ్రీ టైమ్‌లోను పవన్‌ ఫామ్‌హౌస్‌ వైపు చూడడం లేదు. కానీ తరచుగా అల్లు అర్జున్‌ గెస్ట్‌ హౌస్‌ దగ్గర పిచాపాటీ మాట్లాడుకుంటూ కనిపిస్తున్నాడని అంటున్నారు. అతని మలి చిత్రం అల్లు అర్జున్‌తోనే అయినా కానీ పవన్‌తో తప్ప మిగతా హీరోలతో త్రివిక్రమ్‌ అలా ఆంతరంగికంగా కలిసి ట్రావెల్‌ చేయడం జరగలేదు. కానీ అల్లు అర్జున్‌తో ఆల్రెడీ మూడవ చిత్రం చేస్తోన్నందువల్ల ఏర్పడిన చనువో ఏమిటో గానీ ఇద్దరూ బాగా క్లోజ్‌ అయిపోయారని చెబుతున్నారు. మరి ఈ క్లోజ్‌నెస్‌ ఈ సినిమా వరకే పరిమితమా లేక పవన్‌ ఆబ్సెన్స్‌లో అల్లు అర్జున్‌కి ఆ స్థానాన్ని త్రివిక్రమ్‌ ఇచ్చినట్టేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English