మహేష్ నటనకు అవార్డు గ్యారెంటీ అట

మహేష్ నటనకు అవార్డు గ్యారెంటీ అట

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 25వ సినిమా ‘మహర్షి’. దీన్ని అతను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. ‘ఊపిరి’ లాంటి మెమొరబుల్ మూవీ తర్వాత చాలా టైం తీసుకుని ఈ కథ రెడీ చేశాడు వంశీ. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లాంటి ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇటు దర్శకుడు వంశీ పైడిపల్లి, అటు నిర్మాత దిల్ రాజు ఓ రేంజిలో చెబుతున్నారు. మహేష్ కెరీర్లో మెమొరబుల్ ఫిలిం అని.. ది బెస్ట్ కూడా కావచ్చని దిల్ రాజు అన్నాడంటే సినిమాపై వాళ్లకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో మహేష్ నటన గురించి, క్లైమాక్స్ గురించి యూనిట్ వర్గాలు గొప్పగా చెబుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన జయసుధ సైతం ఇదే మాట అంటోంది.

మహేష్ బాబు తన కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ ‘మహర్షి’లో ఇచ్చాడంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ముఖ్యంగా రెండు సీన్లలో మహేష్ నటన అద్భుతమని.. ఆ సీన్లలో తాను మహేష్‌ను చూస్తూ ఉండిపోయానని.. తన డైలాగులు కూడా మరిచిపోయానని ఆమె అంది. ‘మహర్షి’లో మహేష్ నటనకు అవార్డు రావడం గ్యారెంటీ అని కూడా ఆమె చెప్పింది. జయసుధ మాటలు మహేష్ అభిమానుల్లో ‘మహర్షి’పై ఉన్న అంచనాల్ని మరింత పెంచేసేవే. మల్టీ మిలియనీర్ అయిన ఓ వ్యక్తి.. విచిత్రమైన పరిస్థితుల్లో పల్లెటూరికి వచ్చి వ్యవసాయం చేసే కథతో ‘మహర్షి’ తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించగా.. పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. మే 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English