క్యాట్ కరుణించింది.. ఈసీ మళ్లీ దూరం పెట్టింది...

క్యాట్ కరుణించింది.. ఈసీ మళ్లీ దూరం పెట్టింది...

ప్రధాని మోడీ ఒడిస్సాలో ప్రచారం సందర్బంగా సంబల్ పూర్ ఆయన హెలికాప్టర్ ను తనిఖీ చేసి సస్పెన్షన్ కు గురైన కర్నాటక క్యాడర్ ఐఏఏస్ అధికారి, ఒడిస్సా ఎన్నికల పరిశీలకుడు మొహీసీన్ కు క్యాట్ ఉత్తర్వు ఊరటనిచ్చింది.. ఎన్నికల కమిషన్ విధించిన సస్పెన్షన్ పై బెంగళూరులోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టే విధించింది.. దీంతో ఆయనపై నున్న సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసు విచారణ సందర్బంగా క్యాట్ ఈసీ తో పాటు నలుగురి కి నోటీసులు జారీ చేసింది..తదుపరి విచారణను జూన్ ఆరుకు వాయిదా వేసింది...
ఇదిలా ఉంటే  ఒక చేతితో ఇచ్చి మరో చేతితో తీసుకునే చందాన... మొహసిన్ సస్పెన్షన్‌పై బెంగళూరులో క్యాట్ స్టే ఇచ్చిన కొద్దిసేపటికే సస్పెన్షన్ ఎత్తివేసిన ఈసీ మొహిసిన్‌ ఎన్నికల విధులు నిర్వహించకుండా నిషేధిస్తూ మరో ఆదేశం జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు అందే వరకు ఆయన ఎలక్షన్ విధులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కర్నాటక సర్కారుకు ఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసు విచారణ సందర్బంగా ఎస్పీజీ రక్షణ ఉన్న వారి హెలికాప్టర్ తనిఖీ చేయరాదన్న ఎన్నికల సంఘం తరపు న్యాయవాదుల వాదనను క్యాట్ తోసిపుచ్చింది.. ఈ సందర్భంగా క్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉన్న వారు ఏమైనా చేసేందుకు అర్హులన్న అభిప్రాయం సరికాదని అభిప్రాయపడింది. కర్నాటక సీఎం కుమారస్వామి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వాహనాలను సైతం అధికారులు తనిఖీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని క్యాట్ ప్రశ్నించింది. మొత్తానికి సస్పెన్షన్ ను ఎత్తివేసి ఎన్నికల విధుల దూరం పెట్టడం ద్వారా ఈసీ మరో సారి విమర్శల పాలైంది.. వెరీ ప్రిటీ ఈసీ....

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English