కాంచన-3 నటికి మీటూ ఎఫెక్ట్‌

కాంచన-3 నటికి మీటూ ఎఫెక్ట్‌

లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహించిన కాంచన - 3 సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే దాదాపుగా 100 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిందనేది ట్రేడ్ టాక్.. అయితే ఈ సినిమా హీరోయిన్ కు లైంగిక వేదింపులు గురయ్యిందట.. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో కాళీ పాత్రకు జోడీగా రోసీ పాత్రలో రష్యన్ నటి నటించింది.. రష్యాకు చెందిన ఆమె అడపాదడపా చిన్న పాత్రల్లో నటిస్తూ 10 ఏళ్లుగా చైన్నైలో ఎంఆర్సీ నగర్‌లో నివసిస్తున్నారు. ఆమెతో పాటు భర్త, పిల్లలు ఉంటున్నారు. మోడల్, నటనను వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం పరిచయమైన 26 ఏళ్ల రుపేశ్ కుమార్.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ... కొన్ని రోజుల క్రితం ఆమెకు ఫొటో షూట్ నిర్వహించాడు. ఆ ఫొటోలను ఆమెకు వాట్సాప్‌ చేసి.. కోర్కె తీర్చమంటూ లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. అతని బ్లాక్ మెయిలింగ్‌తో విసిగి పోయిన ఆమె.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. రూపేశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇప్పటికే గత ఏడాదిగా క్యాస్టింగ్ కౌచ్ సంచలనమైంది.. ముఖ్యంగా దక్షిణాదిలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పెద్ద నటులపై కూడా ఈ ఆరోపణలు రావడం.. ఆందోళనలు జరిగాయి... అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని కాంచన 3 నటికి ఎదురైన సంఘటనే రుజువు చేస్తోంది.. పులుపు చచ్చినా చింత చావదు కదా.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English