దిల్ రాజు.. ‘ఫిదా’ను వదిలేసినట్లే '96' కూడా!

దిల్ రాజు.. ‘ఫిదా’ను వదిలేసినట్లే '96' కూడా!

నిర్మాత అంటే డబ్బుల వ్యవహారాలు చూసే క్యాషియర్ పాత్రకు మారిపోయిన ఈ రోజుల్లో.. సినిమా మేకింగ్‌లో ఇప్పటికీ చాలా కీలకంగా వ్యవహరించే అతి కొద్దిమంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. ఆయన ప్రొడక్షన్లో సినిమా అంటే ఎంత పెద్ద దర్శకుడు ఉన్నా, హీరో ఎంత పెద్దవాడైనా.. రాజు అన్నీ తానై వ్యవహరిస్తాడు. ప్రతి విషయాన్నీ ఆయనే నిర్దేశిస్తాడు. స్క్రిప్ట్ వర్క్ దగ్గర్నుంచి ఫస్ట్ కాపీ తీసే వరకు ఆయన ప్రమేయం ఉంటుంది. తనకు నచ్చని సినిమాల విషయంలో ఆయన నిర్మొహమాటంగా ఉంటారని.. అవసరమైన మేర మార్పులు చేర్పులు చేస్తారని అంటారు. ఐతే కొన్నిసార్లు మాత్రం రాజు తన పాత్రను పరిమితం చేసుకుని పక్కన ఉండిపోతారు. తనకు నచ్చినా నచ్చకపోయినా దర్శకుడికి పూర్తి ఫ్రీడం ఇస్తుంటాడు. అలా రాజు నమ్మి వదిలేసిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకడు.

‘ఫిదా’ మేకింగ్ టైంలో రాజు అస్సలు మేకింగ్‌లో జోక్యం చేసుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. ఈ సినిమా మేకింగ్ టైంలో చాలా వరకు రాజు లొకేషన్లో లేడు. ఒకసారి షూటింగుకి వెళ్లి అక్కడ జరుగుతున్న తంతు తనకు నచ్చపోయినా జోక్యం చేసుకోకుండా వెనక్కి వచ్చేసినట్లు రాజు చెప్పాడు. ఇది పక్కా శేఖర్ కమ్ముల ఫిలిం అని.. ఇందులో తన ప్రమేయమే లేదని రాజు తర్వాత ఓ సందర్భంలో వెల్లడించాడు. ఇప్పుడు ఇదే తరహాలో ఒక సినిమాను రాజు వదిలిపెట్టేశాడట. అదే.. 96 రీమేక్. ఈ సినిమా స్క్రిప్టు వర్క్ వరకు రాజు చురుగ్గా ఉన్నాడు. కానీ షూటింగ్ మొదలయ్యాక మాత్రం రాజు అస్సలు జోక్యం చేసుకోవట్లేదట. ఆల్రెడీ ఒక షెడ్యూల్ చేసింది చిత్ర బృందం. ఎక్కడా మేకింగ్‌లో రాజు ప్రమేయం లేదట. ఇక ముందు కూడా రాజు ఇలాగే దూరంగా ఉండబోతున్నాడట. 96 రీమేక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడం.. పైగా రీమేక్ కావడంతో దర్శకుడి విజన్‌కే దాన్ని వదలేయాలని రాజు ఫిక్సయినట్లు తెలిసింది. మరి ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English