బ్లాక్ బస్టర్ కొట్టినా పైసా ప్రయోజనం లేదు

బ్లాక్ బస్టర్ కొట్టినా పైసా ప్రయోజనం లేదు

సినీ రంగంలో అందరూ సక్సెస్ చుట్టూనే తిరుగుతారని పేరు. సాధారణంగా హీరోయిన్లకు సినిమాల ఫలితంలో వాటా తక్కువే కానీ.. వాళ్లు హిట్టు కొడితే లక్కీ హీరోయిన్ అని, ఫ్లాపు ఎదుర్కొంటే ఐరెన్ లెగ్ అని ముద్ర వేసేస్తుంటారు. గత ఫలితాలను బట్టే అవకాశాలు దక్కడం చూస్తుంటాం. ఈ లెక్కన ఒక బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్‌కు అవకాశాలు వెల్లువెత్తాలి. కానీ మెహ్రీన్ కౌర్‌ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఈ సంక్రాంతికి ఆమె ‘ఎఫ్-2’ రూపంలో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. ఆ సక్సెస్‌లో ఆమెకు మంచి వాటానే దక్కింది. ఎందుకంటే సినిమాలో మెహ్రీన్ పోషించిన హనీ పాత్ర బాగా పేలింది. ఆమె మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది ప్రేక్షకులకు. అంత పెద్ద హిట్టు కొట్టి, తన పాత్రకు మంచి పేరు సంపాదించినప్పటికీ తర్వాత అవకాశాలే లేవు మెహ్రీన్‌కు.

ఒకప్పుడు వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నప్పటికీ మెహ్రీన్‌కు అవకాశాలు ఆగలేదు. అలాంటిది దాదాపు అరడజను ప్లాపుల తర్వాత లేక లేక ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే దీని తర్వాత అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యమే. ఛాన్సులు రావడానికి కొంచెం సమయం పడుతుందిలే అని కొంత కాలం అందరూ ఎదురు చూశారు. కానీ ‘ఎఫ్-2’ విడుదలై వంద రోజులు దాటాక కూడా కొత్తగా ఏ చిత్రం సైన్ చేయలేదు మెహ్రీన్. ఎక్కడా వాణిజ్య కార్యక్రమాల్లోనూ ఆమె కనిపించడం లేదు. టాలీవుడ్లో మెహ్రీన్ అనే హీరోయిన్ ఒకరున్నారనే విషయమే అందరూ మరిచిపోయే పరిస్థితి వచ్చింది. తమిళంలో సైతం మెహ్రీన్ నటించిన సినిమాలన్నీ తేడా కొట్టేయడంతో అక్కడ ఆమె కెరీర్ ఏమాత్రం ఊపందుకోలేదు. తెలుగులో కొన్నే అయినా ఆమెకు మరపురాని విజయాలున్నాయి. కానీ అవేవీ ఆమె కెరీర్‌ను వృద్ధిలోకి తీసుకురాకపోవడం విచారకరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English