పాపం నిఖిల్.. సినిమా మళ్లీ వాయిదా

పాపం నిఖిల్.. సినిమా మళ్లీ వాయిదా

‘అర్జున్ సురవరం’ సినిమా ఇప్పటికి ఎన్నిసార్లు వాయిదా పడిందో లెక్క లేదు. గత ఏడాది నవంబరు నుంచి ఈ సినిమా రిలీజ్ ఇదిగో అదిగో అనే అంటున్నారు. కానీ మళ్ల ీమళ్లీ డేట్ మార్చుకుంటూ పోతున్నారు. చివరగా మార్చి 29న రిలీజ్ అని చెప్పి.. చివరి నిమిషంలో వాయిదా వేసిన చిత్ర బృందం.. మే 1న పక్కాగా రిలీజ్ ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. గత కొన్ని రోజులుగా సినిమాను నిఖిల్ అండ్ టీమ్ అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తోంది. ముఖ్యంగా నిఖిల్ అయితే టీవీ ఛానెళ్లు, వెబ్ ఛానెళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. విడుదలకు వారం రోజులే ఉండగా.. రిలీజ్ డేట్ పోస్టర్లతో హడావుడి చేస్తుండటం, యుఎస్ ప్రిమియర్ల గురించి కూడా అప్ డేట్స్ ఇస్తుండటంతో ఈసారి రిలీజ్ పక్కా అనే అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ చిత్రం మరోసారి వాయిదా పడిపోయింది.

ఈ వారం ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ భారీ అంచనాల మధ్య విడుదలవుతుండటం, తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి విపరీతమైన క్రేజ్ కనిపిస్తుండటంతో ‘అర్జున్ సురవరం’ బయ్యర్లు భయపడ్డారట. వాళ్లే సినిమాను వాయిదా వేయమని నిర్మాత ఠాగూర్ మధుపై ఒత్తిడి తేవడంతో ఆయన తలొగ్గక తప్పలేదు. ఈసారి రిలీజ్ పక్కా అనుకుని తీరిక లేకుడా ప్రమోషన్లలో పాల్గొంటున్న నిఖిల్‌కు ఇది పెద్ద షాకే. ఈ విషయంలో అతను బాగానే ఫీలయినట్లున్నాడు. రిలీజ్ వాయిదా నేపథ్యంలో అతను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. తన సినిమా మరోసారి వాయిదా పడటం చాలా బాధగా ఉందని, కానీ ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ దెబ్బకు బయ్యర్లు భయపడి సినిమాను వాయిదా వేయమని అడగడంతో తప్పక నిర్ణయం తీసుకున్నామని నిఖిల్ తెలిపాడు. ఐతే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది అతను వెల్లడించలేదు. మే 9న ‘మహర్షి’ వస్తున్న నేపథ్యంలో ఆ తర్వాతి వారమో, ఆ పై వారమో ‘అర్జున్ సురవరం’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English