ఆమె నాకు ప్ర‌త్యేకం.. పెళ్లి ఇప్పుడే జ‌ర‌గ‌దు

ఆమె నాకు ప్ర‌త్యేకం.. పెళ్లి ఇప్పుడే జ‌ర‌గ‌దు

బాలీవుడ్ లో పుకార్ల‌కు కొద‌వ ఉండ‌దు. వారు వీరితో.. వీరు.. వారితో అంటూ రిలేష‌న్లు.. బ్రేక‌ప్పులు.. ఇలా ఒక రేంజ్లో సాగుతుంటాయి. టాలీవుడ్ లో మాదిరి వ్య‌వ‌హారాలు గుట్టుగా ఉండిపోవు. విష‌యం ఏదైనా స‌రే.. ఇట్టే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. ఈ త‌ర‌హా వార్త‌ల్లో ముఖ్య‌మైంది.. అంద‌రి దృష్టిని త‌ర‌చూ ఆక‌ట్టుకునేది బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరాతో.. బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్ రిలేష‌న్ లో ఉన్నార‌న్న‌ది.

33 ఏళ్ల అర్జున్.. ఒక బిడ్డ‌కు త‌ల్ల‌యిన మ‌లైకాతో కొంత‌కాలంగా రిలేష‌న్ లో ఉన్నార‌ని.. వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లుగా కొంత‌కాలంగా త‌ర‌చూ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. దీనిపై అర్జున్ ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించింది లేదు. అలాంటి ఆయ‌న తాజాగా మ‌లైకా విష‌యం మీద నోరు విప్పారు.

రెండే రెండు మాటలు మాట్లాడిన ఆయ‌న‌.. నాకు మ‌లైకా ఎంతో ప్ర‌త్యేకం. కానీ మా పెళ్లి ఇప్పుడే జ‌ర‌గ‌ద‌ని తేల్చాడు. ఇవాల్టి రోజుల్లో ఏదీ దాచ‌లేమ‌ని.. పెళ్లి చేసుకుంటే చెప్పే చేసుకుంటాన‌న్నారు. త‌న‌కిప్పుడు 33 ఏళ్లు మాత్ర‌మేన‌ని.. ఇప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని తాను అనుకోవ‌టం లేద‌న్నారు.

పెళ్లి గురించి మాట్లాడ‌టం త‌న‌కు ఇష్టం లేద‌ని.. ఒక‌వేళ పెళ్లి చేసుకుంటే మీకు తెలుస్తుంది క‌దా? అని వ్యాఖ్యానించారు. త‌ప్పుడు వార్త‌లు సృష్టించ‌టం స‌రికాద‌ని.. అదే ప‌నిగా వ‌దంతుల్ని సృష్టితో న‌మ్మే వారికి కూడా విసుగొస్తుంద‌న్నారు. ఇలాంటి వాటి కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తే.. త్వ‌ర‌గా అలిసిపోతామ‌న్న ఆయ‌న‌.. న‌చ్చిన వారు చుట్టూ ఉంటే అంత‌కంటే కావాల్సిందేముంది? అని చెప్ప‌టం ద్వారా చెప్పాల్సింది చెప్పేసిన‌ట్లేన‌ని చెబుతున్నారు. అన్న‌ట్లు.. మ‌లైకాతో అర్జున్ పెళ్లికి.. అత‌డి తండ్రి క‌మ్ బాలీవుడ్ ప్ర‌ముఖుడు బోనీ క‌పూర్ కూడా ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English