జెర్సీ తప్పక చూడండి-లారెన్స్

జెర్సీ తప్పక చూడండి-లారెన్స్


గత వారం తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది ‘జెర్సీ’నే. దీనికి పోటీగా వచ్చిన ‘కాంఛన-3’ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాని మీద పెద్దగా అంచనాలు కూడా లేవు. ఇక రిలీజ్ తర్వాత దానికి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే అది పెద్దగా ఆడుతుందని అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మాస్ సెంటర్లలో దుమ్ము దులుపుతూ సాగిపోతోంది. ‘జెర్సీ’ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు లేకపోవడానికి ‘కాంఛన-3’నే కారణం. ఇది ‘జెర్సీ’ టీంకు అసహనం కలిగించే విషయమే. ఐతే ‘కాంఛన-3’ విషయంలో వాళ్ల ఫీలింగ్ ఎలా ఉందో ఏమో కానీ.. ఆ చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్ తన సినిమా వేడుకలో ‘జెర్సీ’ గురించి మాట్లాడటం విశేషం.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కాంఛన-3’ సక్సెస్ మీట్లో లారెన్స్ మాట్లాడుతూ.. ‘జెర్సీ’ ప్రస్తావన తెచ్చాడు. ‘‘మా సినిమా గురించి ఒక్కటే కాదు ‘జెర్సీ’ గురించీ చెప్పుకోవాలి. నిన్న రాత్రి ‘జెర్సీ’ చూశా. చాలా బాగుంది. ఆ సినిమానీ అందరూ చూడాలి’’ అని చెప్పాడు. తన సినిమాకు పోటీగా ఉన్న చిత్రం గురించి ఇంత పాజిటివ్‌గా మాట్లాడటం ద్వారా లారెన్స్ శభాష్ అనిపించుకున్నాడు. మరోవైపు తన సినిమా సక్సెస్ గురించి లారెన్స్ మాట్లాడుతూ.. ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్కును దాటబోతోందని చెప్పాడు. రెండేళ్ల పాటు కష్టపడి ‘కాంఛన-3’ చేశానని.. ప్రతి సీన్ తీసేటపుడు ఇది ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూ చేశానని.. సినిమా అయ్యాక వందల సార్లు చూసుకుని తర్వాత రిలీజ్‌కు రెడీ చేశానని లారెన్స్ తెలిపాడు. ‘కాంఛన-3’ సక్సెస్ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని.. ఈ సిరీస్‌లో కొత్త సినిమా కోసం మంచి కథ రెడీ అయ్యాక సినిమా మొదలుపెడతానని లారెన్స్ తెలిపాడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English