ఇది పుకారు కాదు.. ఒక సీనియ‌ర్ న‌టి చెప్పిన నిజం

ఇది పుకారు కాదు.. ఒక సీనియ‌ర్ న‌టి చెప్పిన నిజం

60 ఏళ్ల ఇండ‌స్ట్రీ అనుభ‌వం.. 700సినిమాలు.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నుంచి డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉంటూ పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ఆర్టిస్ట్ డ‌బ్బింగ్ జాన‌కి. తన వృత్తినే త‌న ఇంటిపేరుగా మార్చుకున్న ఆమె.. త‌ల్లి పాత్ర‌ల‌కు అతికిన‌ట్లుగా స‌రిపోతార‌న్న పేరుంది.

భూకైలాస్ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసి.. తెలుగు.. త‌మిళ‌..క‌న్న‌డ‌.. హిందీ చిత్రాల్లో న‌టించిన ఆమె.. తాజాగా ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.ఈ సంద‌ర్భంగా ఆమె చెప్పిన ఒక మాట వింటే షాక్ త‌గ‌ల‌టం ఖాయం. న‌టీమ‌ణుల్లో ఇలాంటి వారు ఉంటారా? అనిపించ‌క మాన‌దు. ఇండ‌స్ట్రీలో అలా జరిగింద‌ట‌.. ఇలా జ‌రిగింద‌ట‌.. లాంటి మాట‌ల్ని వింటూనే ఉంటాం. పుకార్లు చాలానే ఉన్నా.. ఇది నిజ‌మని.. త‌న అనుభ‌వంగా ఒక సీనియ‌ర్ న‌టి చెప్పిన ఈ ఉదంతం షాకింగ్ గా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
 
ఒక‌సారి తాను అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్లిన‌ప్పుడు చోటు చేసుకున్న ఉదంతంగా జాన‌కి చెప్పారు. అప్ప‌ట్లో ఒక్కో న‌టికి ఒక్కో రూం ఇచ్చే వారు కాదు.. ఇద్ద‌రు ముగ్గురికి క‌లిపి ఒక‌టే రూంలో బ‌స ఏర్పాటు చేసేవారు. త‌న‌కేమో త్వ‌ర‌గా తినేసి ప‌డుకోవ‌టం అల‌వాటు కావ‌టంతో.. త‌న‌తో రూం షేరింగ్ చేసుకున్న న‌టి కంటే తాను భోజ‌నం చేసేసిన‌ట్లు చెప్పారు. త‌ర్వాత వ‌చ్చిన ఆ న‌టి.. త‌న కంటే ముందే మ‌రొక‌రు భోజ‌నం చేయ‌ట‌మా? అంటూ కోపంతో కాలితో క్యారేజీని ఒక్క త‌న్ను త‌న్న‌టం.. అన్న‌మంతా చింద‌ర‌వంద‌ర‌గా ప‌డిపోయిట‌నట్లుచెప్పారు. ఎవ‌రా న‌టి? అంటే తాను చెప్ప‌న‌ని చెప్పిన ఆమె.. ఇప్ప‌టికి ఇండ‌స్ట్రీలోనే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.  ఆగ్ర‌న‌టులు త‌ర్వాత‌.. చిన్న న‌టుల్లో కూడా మ‌రీ ఇంత అహంభావ‌మా? అన్న ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English