ఒక్క సెకనుకు 18 టికెట్లట

ఒక్క సెకనుకు 18 టికెట్లట

ఒక కొత్త సినిమా రిలీజవుతుంటే.. రిలీజయ్యే స్క్రీన్ల గురించి, టికెట్ల అమ్మకాల గురించి ఓ రేంజిలో మాట్లాడుకుంటున్నారంటే సాధారణంగా అది లోకల్ సూపర్ స్టార్ల సినిమానే అయ్యుంటుంది. కానీ ఒక హాలీవుడ్ మూవీ రిలీజ్ గురించి, దాని టికెట్ల అమ్మకాల గురించి దేశవ్యాప్తంగా చర్చించుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. ఆ సినిమానే.. ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్. ఈ సినిమా ఇండియాలో మామూలు సంచలనాలు సృష్టించట్లేదు. ఇండియాలో దీని రిలీజ్ స్థాయి టికెట్ల అమ్మకాల గురించి వస్తున్న అప్ డేట్స్ చూస్తుంటే మతిపోతోంది. ఏకంగా ఐదు వేల దాకా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి టికెట్లు ఇలా పెడితే అలా అయిపోతున్న పరిస్థితి. వీకెండ్ మొత్తానికి బుకింగ్స్ పూర్తయి.. తర్వాత వచ్చే వీక్ డేస్ మీద పడిపోయారు జనాలు.

కొన్ని చోట్ల 24 గంటలూ నిర్విరామంగా ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ప్రదర్శనకు థియేటర్ల యాజమాన్యాలు అనుమతులు తీసుకుని బుకింగ్స్ ఓపెన్ చేయడం విశేషం. ఈ చిత్రానికి జరుగుతున్న బుకింగ్స్ చూసి ‘బుక్ మై షో’ వాళ్లు కూడా షాకవుతున్నారు. ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా ఓ హాలీవుడ్ సినిమాకు అతి తక్కువ రోజుల్లో 10 లక్షల టికెట్లను అమ్మిందట ‘బుక్ మై షో’. మామూలుగా ఈ ఫీట్ మన సూపర్ స్టార్ల సినిమాలకే సాధ్యమవుతుంటుంది. సెకనుకు 18 టికెట్ల చొప్పన ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ టికెట్లు అమ్ముడవుతున్నట్లు కూడా ‘బుక్ మై షో’ వెల్లడించింది. దీన్ని బట్టి ఈ చిత్రానికి ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందో.. జనాలు ఎలా ఎగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. టికెట్లు ఎక్కువ అందుబాటులో ఉంటే ఈ రేట్ ఇంకా ఎక్కువగా ఉండునేమో. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ శుక్రవారమే ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English