దిల్ రాజుదే హవా.. వాళ్లిద్దరూ డమ్మీలే

దిల్ రాజుదే హవా.. వాళ్లిద్దరూ డమ్మీలే

దిల్ రాజు, అశ్వినీదత్, పొట్లూరి వరప్రసాద్.. ఈ ముగ్గురిలో ఎవరికి వాళ్లు భారీ నిర్మాతలే. ముగ్గురికీ పెద్ద నిర్మాణ సంస్థలున్నాయి. దీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలే చేశారు. ఇలాంటి ముగ్గురు నిర్మాతలు కలిసి ఒక సినిమా చేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ అరుదైన కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. ఐతే పేరుకే ముగ్గురు నిర్మాతలు కానీ.. మొదట్నుంచి ఇది దిల్ రాజు సినిమాగానే ప్రొజెక్ట్ అవుతోంది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ రాజు మాత్రమే నిర్మాతలా కనిపిస్తున్నాడు. సినిమా మేకింగ్‌ కూడా పూర్తిగా ఆయన చేతుల మీదుగానే జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది.

‘మహర్షి’కి సంబంధించిన ప్రెస్ మీట్లలో కావచ్చు.. ఆన్ లొకేషన్ ఫొటోల్లో కావచ్చు రాజు మాత్రమే కనిపిస్తున్నాడు. అసలు ప్రొడక్షన్ విషయంలో అశ్వినీదత్, పీవీపీ జోక్యమే లేనట్లుంది. వాళ్లకు ఆ దిశగా ఆసక్తి ఉన్నట్లు కూడా కనిపించలేదు. మామూలుగా దత్ నిర్మాత అయితే పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. ఐతే దత్‌తో ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉండటంతో దాని ఆనర్ చేయడానికి మహేష్ ఈ సినిమాలో ఆయన్ని భాగస్వామిని చేసినట్లుంది. ఆయన కొంత పెట్టుబడి పెట్టి ఆ మేరకు ఆదాయంలో వాటా తీసుకుని ఊరుకున్నట్లున్నారు.

ఇక పీవీపీ ఈ ప్రాజెక్టులో ఎలా భాగమయ్యాడో తెలిసిందే. తన బేనర్లో చెయ్యాల్సిన సినిమాను వేరే సంస్థకు తీసుకెళ్లిపోవడంతో పీవీపీ కోర్టుకెక్కాడు. ఓవైపు ప్రి ప్రొడక్షన్ నడుస్తుండగా.. ఈ కేసు నడిచింది. షూటింగ్ మొదలయ్యాక కూడా వివాదం తేలలేదు. పీవీపీ ఎంతకూ పట్టువదలకపోవడం, కోర్టు కేసు వల్ల షూటింగే ఆగిపోయే పరిస్థితి రావడంతో రాజీకి రాని పరిస్థితి నెలకొంది. పీవీపీకి సినిమాలో వాటా ఇవ్వడానికి రాజు, దత్ అంగీకరించారు.  అంతే తప్ప పీవీపీకి సినిమాలో ఏరకంగానూ ప్రమేయం ఉన్నట్లు లేదు. ఈ రకంగా పేరుకు ముగ్గురు నిర్మాతలే కానీ.. ప్రొడక్షన్ అంతా రాజే చూసుకుంటున్నాడు. దత్, పీవీపీ ఇందులో పెద్దగా ఇన్వాల్వ్ అయినట్లు లేరు. వాళ్లను స్లీపింగ్ పార్ట్‌నర్స్‌గా చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English