‘మహర్షి’ తప్పుకుని మంచి పని చేశాడు

‘మహర్షి’ తప్పుకుని మంచి పని చేశాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. మహేష్ బాబుకు కలిసొచ్చిన ఏప్రిల్ నెలలో 25వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో ఆ సమయానికి ఫస్ట్ కాపీ రెడీ కావడం కష్టమని భావించి మే 9కి వాయిదా వేశారు. ఐతే అచ్చొచ్చిన ఏప్రిల్‌ను వదిలేసి మహేష్‌కు ఏమాత్రం కలిసి రాని మే నెలను ఎంచుకోవడంపై అభిమానులు ఫీలయ్యారు. కానీ ఏప్రిల్ 25నే ‘మహర్షి’ని రిలీజ్ చేస్తే మాత్రం కచ్చితంగా పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండేదే.

ఈ వారం విడుదలవుతున్న ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’కు ఎలాంటి క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో సైతం దీనికి విపరీతమైన హైప్ ఉంది. బుకింగ్స్ మామూలుగా లేవు. మహేష్ బాబు సినిమా రిలీజైతే పరిస్థితి ఎలా ఉండేదో.. ‘ది ఎండ్ గేమ్’కు కూడా అలాంటి క్రేజే కనిపిస్తోంది. మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా మోత మోగించేసేలా ఉంది. ‘మహర్షి’ రిలీజైతే దాని వల్ల ‘ఎవెంజర్స్’కు తగిలే దెబ్బ కంటే.. దాని వల్ల ‘మహర్షి’కే ఇబ్బంది ఉండేది. ఎందుకంటే మహేష్ సినిమాపై ఉన్న స్టేక్స్ ఏంటో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల అవతల కూడా ‘మహర్షి’ వసూళ్లపై చాలా ప్రభావం పడేది. ఇక అమెరికాలో మహేష్ సినిమాపై భారీ పెట్టుబడి పెడతారు కాబట్టి.. అక్కడ ఈ వారం ‘మహర్షి’ రిలీజైతే ‘ఎవెంజర్స్’ దెబ్బ గట్టిగానే తగిలేది. కాబట్టి ఇక్కడా అక్కడా ఏ పోటీ లేకుండా మే 9న రిలీజ్ చేసుకోవడమే చాలా మంచిదైందని భావించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English