తేజ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది

తేజ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది

ఒక హాలీవుడ్ డబ్బింగ్ సినిమాకు భయపడి మన సినిమాల్ని వాయిదా వేసుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు అదే జరిగింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ దెబ్బకు భయపడి ఈ వారం ఒక్క తెలుగు సినిమాను కూడా రిలీజ్ చేయట్లేదు. ఆల్రెడీ ఈ వారానికి షెడ్యూల్ అయిన ‘సీత’ చిత్రాన్ని కూడా వాయిదా వేసేశారు. ఓ వారం కిందటి వరకు కూడా ఈ చిత్రం రేసులోనే ఉంది. ప్రమోషన్లు కూడా చేస్తూ కనిపించారు. కానీ ‘ఎవెంజర్స్’ బుకింగ్స్ ఓపెనయ్యాక జనాలు టికెట్ల కోసం ఎగబడ్డ తీరు.. పెట్టిన టికెట్లు పెట్టినట్లు అయిపోవడం చూసి కంగారు పడ్డట్లున్నారు. అసలే తమ సినిమాకు బజ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో.. దానికి ఎదురెళ్తే అంతే సంగతులని భావించి వెనక్కి తగ్గినట్లున్నారు.

ఏప్రిల్ 25ను వదిలేస్తే.. వచ్చే మూడు వారాల్లో సినిమాను రిలీజ్ చేయడం కష్టం. మే 1న ‘అర్జున్ సురవరం’ వస్తుండగా.. తర్వాతి వారానికి ‘మహర్షి’ దిగుతున్నాడు. ఆ చిత్రానికి ముందు, వెనుక వారాల్లో రిలీజ్ చేస్తే కష్టమని భావించి ‘సీత’ను మే 24కు వాయిదా వేసేశారు. అంటే అనుకున్న డేటు కంటే నెల రోజులు ఆలస్యంగా సినిమా రాబోతోందన్నమాట. ఐతే ఈ సినిమాకు ఇప్పటికైతే ఏమాత్రం బజ్ కనిపించడం లేదు. పేలవమైన టీజర్ ఈ సినిమాకు చేటు చేసింది. తేజ గత సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’లోని మెరుపులేవీ ఇందులో కనిపించలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో కావడం కూడా మైనస్‌గానే కనిపిస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ విషయంలో అయినా జాగ్రత్త పడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా కట్ చేయకపోతే కష్టం. ఈ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర ఫలితం విషయంలో బాగానే టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English