‘మహర్షి’ ఏదనుకున్నారో అదే..

‘మహర్షి’ ఏదనుకున్నారో అదే..

‘మహర్షి’ కథ మీద రెండేళ్లకు పైగా పని చేశాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా గురించి అతడితో పాటుగా నిర్మాత దిల్ రాజు కూడా ఓ రేంజిలో చెబుతున్నారు. ఐతే ఈ కథ విషయంలో ప్రేక్షకులు ముందే ఒక అంచనాకు వచ్చేశారు. దీని గురించి మీడియాలో ఇప్పటికే ఊహాగానాలు నడిచాయి. ఈ చిత్ర ప్రోమోలు చూస్తుంటే ఈ అంచనాలు, ఊహాగానాలు కరెక్టే అనిపిస్తోంది. ఈ చిత్రంలో హీరో ఒక బిలియనీర్ అని.. విదేశాల్లో వ్యాపారం చేస్తుంటాడని.. ఐతే తనను తాను రీడిస్కవర్ చేసుకునే క్రమంలో ఇండియాలో ఒక యూనివర్శిటీకి చదువుకోవడానికి వస్తాడని.. అక్కడ పేదవాడైన అల్లరి నరేష్ కనిపిస్తాడని.. అతడితో స్నేహం తర్వాత.. తన కోసం ఒక ఛాలెంజ్ తీసుకుని పల్లెటూరికి వెళ్లి వ్యవసాయం చేస్తాడని.. ఇలా‘మహర్షి’ కథ మీద జనాలకు ఇప్పటికే ఒక అంచనా ఉంది.

ఈ మధ్య రిలీజ్ చేసిన ఒక పాటతో మహేష్ విదేశాల్లో బిలియనీర్ అనే సంగతి స్పష్టమైంది. ఇక టీజర్, ‘ఛోటీ  ఛోటీ బాతే’ పాట, ఇతర పోస్టర్లు చూస్తే మహేష్ ఇండియాలో ఒక కాలేజీకి వచ్చి చదువుకోవడం, నరేష్‌తో స్నేహం కరెక్టే అని స్పష్టమైంది. తాజాగా సినిమాలోని కొత్త పాటకు సంబంధించి ఒక పోస్టర్ వదిలారు. అందులో మహేష్ రైతులతోో కలిసి పొలంలో పని చేయడానికి అడుగులు వేస్తున్నాడు. మొత్తానికి కథ విషయంలో ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ వ్యవసాయం అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ‘శ్రీమంతుడు’ సినిమా లైన్ కూడా ఇలాగే ఉంటుంది. ‘మహర్షి’ విజువల్స్, ప్రోమోలు మొదట్నుంచి ‘శ్రీమంతుడు’కి చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి. హీరో వ్యవసాయం చేయడం మినహాయిస్తే ఇందులో కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. మరి వంశీ పైడిపల్లి కొత్తగా ఏం చూస్తాడన్నది ఆసక్దికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English