నాని మళ్లీ మిలియనీర్ అయ్యాడు

నాని మళ్లీ మిలియనీర్ అయ్యాడు

తెలుగు రాష్ట్రాల్లో నాని జస్ట్ స్టారే కావచ్చు. కానీ యుఎస్ మార్కెట్లో మాత్రం సూపర్ స్టార్ అనే చెప్పాలి. మన దగ్గర పెద్ద స్టార్లు అనుకునే వాళ్లకు యుఎస్‌లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ నానికి మాత్రం తిరుగులేని మార్కెెట్ ఉంది. అతడి సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా మినిమం హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తాయి. ఇక టాక్ బాగుంటే మిలియన్ డాలర్స్ అనేది సాధారణమైన విషయం. అతడి కొత్త సినిమా ‘జెర్సీ’ అలవోకగా మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. మూడు రోజుల వీకెండ్ ముగిసేసరికే ‘జెర్సీ’ 9.2 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. ప్రిమియర్లతోో 1.45 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘జెర్సీ’.. శుక్రవారం 2.6 లక్షల డాలర్లు.. శనివారం 3.2 లక్షల డాలర్లు.. ఆదివారం 2 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. సోమవారం వసూళ్లు డ్రాప్ అయినప్పటికీ.. మిలియన్ డాలర్ల మార్కు పూర్తయ్యేందుకు అవసరమైన మేర కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

నానికి ఇది ఆరో మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. ‘ఈగ’తో అతను తొలిసారిగా మిలియన్ డాలర్ హీరో అయ్యాడు. ఐతే అందులో నానిది అతిథి పాత్ర తరహా కాబట్టి దాన్ని అతడి ఖాతాలో వేయలేం. నానికి నిఖార్సయిన ఫస్ట్ మిలియన్ డాలర్ మూవీ అంటే ‘భలే భలే మగాడివోయ్’ అని చెప్పాలి. ఆ సినిమా ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత నానికి ఈ క్లబ్బు మామూలైపోయింది. ‘నేను లోకల్’.. ‘నిన్ను కోరి’.. ‘ఎంసీఏ’ సినిమాలు ఈ మార్కును దాటాయి. ‘మజ్ను’, ‘జెంటిల్‌మన్’, ‘దేవదాస్’ సినిమాలు మిలియన్ డాలర్ మార్కుకు చేరువగా వెళ్లాయి. ‘జెర్సీ’కి ఉన్న టాక్ ప్రకారం చూస్తే ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటే అవకాశముంది. ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ.15 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఐతే ఫుల్ రన్లో రూ.27 కోట్ల షేర్ సాధిస్తేనే ఇది బ్రేక్ ఈవెన్‌కు వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English