లైంగిక వేధింపు కేసు.. ఆ నటుడికే మద్దతు

లైంగిక వేధింపు కేసు.. ఆ నటుడికే మద్దతు

‘మీ టూ’ మూమెంట్ ఊపందుకున్నాక సినీ పరిశ్రమలో పని చేసే అమ్మాయిల్లో చాలామంది ఇక్కడ ఏదైనా ఇబ్బంది తలెత్తితే ధైర్యంగా గళం విప్పుతున్నారు. మీడియా ముందుకొస్తున్నారు. పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ కోవలోనే ఓ అమ్మాయి ఓ థియేటర్ ఆర్టిస్ట్ గ్రూప్ ట్రైనింగ్‌లో భాగంగా దాని శిక్షకుడైన వినయ్ వర్మ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘అరవింద సమేత’ సహా అనేక చిత్రాల్లో నటించాడీ వినయ్ వర్మ. ఆయనకు నటుడిగా కంటే కూడా ఆ థియేటర్ గ్రూప్ శిక్షకుడిగానే ఎక్కువ పేరుంది. ఐతే శిక్షణలో భాగంగా స్టూడెంట్స్ అందరినీ ఇన్నర్ వేర్ మినహా బట్టలు విప్పమని అతను ఆదేశించడం వివాదాస్పదమైంది. తాను అందుకు నిరాకరించినందుకు వినయ్ కోపం తెచ్చుకుని బయటికి పంపేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

ఐతే వినయ్ చేసిన పని లైంగిక వేధింపుల కిందికి వస్తుందా రాదా అన్న చర్చ మొదలైంది. ఈ శిక్షణలో ఉన్న మిగతా స్టూడెంట్స్‌తో పాటు సీనియర్ థియేటర్ ఆర్టిస్టులు (అందులో మహిళలు కూడా ఉన్నారు) వినయ్‌కి మద్దతుగా నిలవడం గమనార్హం. వినయ్‌తో వీళ్లందరితో ఈ వివాదంపై మాట్లాడిస్తూ ఓ ఇంగ్లిష్ డైలీ కథనం ప్రచురించింది. చుట్టూ ఎంతో మంది వ్యక్తులు ఉండగా.. కెమెరా ముందు బోల్డ్ సీన్స్ చేయాల్సి ఉంటుందని.. తమ బాడీ విషయంలో ఎలాంటి బెరుకు లేకుండా నటించడానికి ఇలాంటివి అవసరమని వీళ్లంతా అంటున్నారు.

శిక్షణలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ.. ముందు వినయ్ బట్టలు విప్పమనడంతో తాము కూడా షాకయ్యామని.. కానీ ఆ తర్వాత ఆయన తమను ట్రైన్ చేసిన విధానం చూశాక అందులో తప్పేమీ అనిపించలేదని.. అందులో సెన్స్ ఉందనిపించిందని వారు పేర్కొన్నారు. తమను ట్రైన్ చేసేటపుడు వినయ్ చాలా దూరంగా నిలబడి సూచనలిస్తూ ఉన్నాడని.. తమ దగ్గరికి కూడా రాలేదని వారన్నారు. వినయ్ జెంటిల్మన్ అని.. ఇదంతా థియేటర్ గ్రూప్ ట్రైనింగ్‌లో భాగమే అని ఒక సీనియర్ లేడీ థియేటర్ ఆర్టిస్ట్ పేర్కొన్నారు. మరోవైపు వినయ్ మాట్లాడుతూ.. తాను దశాబ్ద కాలంగా ఈ తరహాలో శిక్షణ ఇస్తున్నానని.. ఇప్పటిదాకా ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని.. తాను ఉద్దేశపూర్వకంగా అది చేయలేదని.. ఎవరో చూస్తున్నారని, కెమెరా ఫియర్ గురించి ఆలోచించకుండా ఫ్రీగా నటించేందుకు ఇది తోడ్పడుతుందని అతనన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English