నానిని చూసి నేర్చుకోండి!

నానిని చూసి నేర్చుకోండి!

అన్నిసార్లు గొప్ప కథలు రావు కానీ ఒక్కోసారి మాత్రం ఎవరైనా స్టార్‌ రిస్క్‌ చేస్తే మాత్రం రీచ్‌ పెరిగి చిరస్థాయిగా గుర్తుండిపోయే స్థాయి కథలు వుంటాయి. అయితే అలాంటి కథలని హీరోలు ఎంకరేజ్‌ చేయాలి. పది కోట్లు పారితోషికం తీసుకునే హీరో ఏదైనా రిస్క్‌ వుందనిపించిన కథ వచ్చినపుడు తన పేమెంట్‌ పరంగా పట్టు విడుపులు ప్రదర్శించాలి. లేదంటే ఆ కథని సినిమాగా తీయడానికి మార్కెట్‌ డైనమిక్స్‌ సహకరించవు. జెర్సీ కథనే తీసుకుంటే ఇది చాలా రిస్కీ సబ్జెక్ట్‌. నాని రెగ్యులర్‌ సినిమాల మాదిరిగా ఖర్చు పెట్టి మార్కెట్‌ చేసేస్తే కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అవడానికి ఆస్కారమెక్కువ.

నాని కనుక తన పారితోషికం విషయంలో రాజీ పడకపోతే జెర్సీ సినిమా అసలు నిర్మాతలకి ప్రాఫిటబుల్‌ అనిపించదు. జెర్సీ కథ విన్న తర్వాత తన పారితోషికంలో రిబేటు ఇవ్వకుండా అసలు పారితోషికమే వద్దని నాని చెప్పాడు. లాభాలు వస్తే వాటా తీసుకుంటానని మాత్రం నాని నిర్మాతలతో అన్నాడు. దాని వల్ల ఈ చిత్రాన్ని ధైర్యంగా అంత ఖర్చు పెట్టి తీయగలిగారు. ఈ రోజు దాని ఫలితం చవిచూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English