తేజ్‌ని అయోమయంలో పడేసిన చిత్రలహరి

తేజ్‌ని అయోమయంలో పడేసిన చిత్రలహరి

అరడజను ఫ్లాపుల తర్వాత హిట్టు పడితే ఆనందమే కానీ దానిని నిలబెట్టుకోవడం ఎలాగనే టెన్షన్‌ ఆ ఆనందాన్ని కూడా డామినేట్‌ చేస్తుంది. 'చిత్రలహరి' స్వల్ప లాభాలతో గట్టెక్కిపోవడంతో తేజ్‌ ఆనందంగా వున్నాడు కానీ ఇంకా తదుపరి చిత్రంపై క్లారిటీ రాలేదు. చిత్రలహరి కోసం లుక్‌ మార్చిన సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరులోంచి తీసేసిన 'ధరమ్‌'ని ఇక కొనసాగించరాదని డిసైడ్‌ అయ్యాడు. అంటే ఇకపై ఎస్‌డిటిని ఎస్‌టీ అని మాత్రమే పిలవాలన్నమాట. చిత్రలహరిలో గుబురు గడ్డంతో కనిపించిన సాయి తేజ్‌ తదుపరి చిత్రంలో మళ్లీ రెగ్యులర్‌ ట్రిమ్‌ చేసిన గడ్డం లుక్‌కి మారిపోనున్నాడు. అయితే ఇంకా గడ్డమయితే తొలగించలేదు.

అతని కోసం మారుతి ఒక కథ సిద్ధం చేసే పనిలో వున్నాడు కానీ మారుతి కథలు ఎలా వుంటాయనేది తెలిసిందే. అతనిదంతా కమర్షియల్‌ ఫార్ములా. దానికి కాస్త భిన్నంగా వెళ్లడం వల్లే చిత్రలహరి ఆడిందని అనుకుంటూ వుంటే మళ్లీ ఇప్పుడు ఫార్ములా సినిమా చేయాలా అనేది సాయి తేజ్‌ ఆలోచన. మారుతి కాకుండా ఇక మరే దర్శకుడితోను సాయి తేజ్‌కి కమిట్‌మెంట్‌ లేదు. కాకపోతే చిత్రలహరి చూసిన తర్వాత తనని డిఫరెంట్‌గా విజువలైజ్‌ చేస్తూ యువ దర్శకులు కొత్త కథలు పట్టుకొస్తారని చూస్తున్నాడు. అయితే మిడిల్‌ రేంజ్‌ హీరోల్లో ప్రస్తుతం బాగా దిగువన వున్న తేజ్‌ వరకు ఒక కథ రావాలంటే పైన చాలా మంది రిజెక్ట్‌ చేసి వుండాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English