గీత - గోవిందం కలిస్తే బ్లాక్‌బస్టరే!

గీత - గోవిందం కలిస్తే బ్లాక్‌బస్టరే!

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందాన కలిసి నటించిన 'గీత గోవిందం' పదిహేను కోట్ల లోపు బడ్జెట్‌లో రూపొందిన చిత్రాలకి బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసింది. డెబ్బయ్‌ కోట్ల షేర్‌తో ఆ జంట చేసిన సంచలనం మళ్లీ 'డియర్‌ కామ్రేడ్‌'తో రిపీట్‌ అవుతుందనే అంచనాలున్నాయి. 'డియర్‌ కామ్రేడ్‌' బాక్సాఫీస్‌ వద్ద ఏమి చేస్తుందో అనేది ఇంకా తెలియదు కానీ ఈలోగా ఈ జంట ఒక ఫోటోతో బ్లాక్‌బస్టర్‌ సాధించింది.

డియర్‌ కామ్రేడ్‌ షూటింగ్‌ కేరళలో జరుగుతుండగా, షాట్‌ గ్యాప్‌లో విజయ్‌ దేవరకొండని రష్మిక ఫోటో తీసింది. ఆ ఫోటోని విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఆ ఫోటో వైరల్‌ అయిపోయి పది లక్షలకి పైగా వ్యూస్‌ తెచ్చుకుంది. విజయ్‌ పెట్టిన ఫోటోల్లో అత్యధిక లైక్స్‌ వచ్చిన ఫోటో ఇదే కావడం విశేషం. ఈ ఫోటోలో విజయ్‌ గ్లామర్‌ చూసి కొందరు హీరోయిన్లు కూడా సగటు అమ్మాయిల మాదిరిగా అతడికి ఫిదా అయిపోయామంటూ కామెంట్స్‌ పెట్టారు. డియర్‌ కామ్రేడ్‌ చిత్రానికి వున్న క్రేజ్‌కి తోడు ఇలా సోషల్‌ మీడియా ద్వారా ఈ జంట ఈ చిత్రానికి ఎక్స్‌ట్రా బజ్‌ తెచ్చిపెట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English