దిల్ రాజే మళ్ళీ ఆదుకుంటున్నాడు

దిల్ రాజే మళ్ళీ ఆదుకుంటున్నాడు

కెరీర్ చాలా ఇబ్బందికర దశలో ఉండగా దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత సంస్థలో రాజ్ తరుణ్ సినిమా చేస్తున్నాడనగానే అతడి దశ తిరగుతుందనే అంతా అనుకున్నారు. కానీ రాజు ప్రొడక్షన్లో ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ చేసిన ‘లవర్’ అట్టర్ ఫ్లాప్ అయింది. అతడి కెరీర్‌ను మరింత ప్రమాదంలోకి నెట్టింది. ఈ సినిమా సక్సెస్ మీద నమ్మకం లేని రాజు.. ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో తన అస ఈ సినిమాకు బడ్జెట్ పెరిగిపోవడంతో అసహనానికి గురైన దిల్ రాజు.. ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో తన అసహనాన్ని చూపించేశాడు. రాజ్ తరుణ్ గాలి తీసేలా మాట్లాడాడు. అతడికి పెద్దగా మార్కెట్ లేదని.. కానీ సినిమాకు ఎక్కువ ఖర్చు చేశారు అనేశఆడు. ఈ మాటలు రాజ్ తరుణ్‌ను బాగా డ్యామేజ్ చేశాయి. ఈ సినిమా తర్వాత అతడికి అవకాశాలే రాలేదు.

ఈ స్థితిలో తన వల్ల నష్టపోయిన రాజ్‌ను ఆదుకోవడానికి దిల్ రాజే ముందుకొచ్చాడు. అతడితో మరో సినిమా తీసి పాప పరిహారం చేసుకునే పనిలో పడ్డాడు. వీళ్లిద్దరి కలయికలో కొత్త సినిమాకు ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజే సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. జి.ఆర్.కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకుముందు అతను సుధీర్ బాబుతో ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ సినిమా తీశాడు. దిల్ రాజు బేనర్లో ఎన్నో సినిమాలకు ఛాయాగ్రహణం అందించిన సీనియర్ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి ఈ చిత్రానికి పని చేయనున్నాడు. ‘బొమ్మరిల్లు’ సహా చాలా సినిమాలకు రచన చేసిన అబ్బూరి రవి ఈ చిత్రానికి రచనా సహకారం అందించనున్నాడు. మరి ‘లవర్’ తాలూకు చేదు జ్నాపకాల్ని చెరిపేస్తూ రాజు-రాజ్‌లకు ఈ చిత్రం మంచి ఫలితాన్నందిస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English