మన సినిమాలని నెత్తిన పెట్టుకుంటున్నారు

మన సినిమాలని నెత్తిన పెట్టుకుంటున్నారు

మంచి సినిమా తీస్తే ఇండియాలో అయినా వంద కోట్లు వస్తాయో రావో తెలియదు కానీ చైనాలో మాత్రం వందల కోట్లు వచ్చి పడతాయని అంధాదూన్‌ విజయం నిరూపిస్తోంది. ఇండియన్‌ సినిమాలో ఇటీవల వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటయిన అంధాదూన్‌ చైనాలో అవలీలగా మూడు వందల కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఇండియన్‌ సినిమాల్లో దంగల్‌, సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ తర్వాత ఇప్పుడు ఇదే టాప్‌లో వుంది. యాభై మిలియన్‌ డాలర్లు సాధించే దిశగా దూసుకుపోతోన్న ఈ చిత్రం మంచి సినిమాలు తీస్తోన్న ఇండియన్‌ ఫిలిం మేకర్స్‌కి ఎనలేని ధైర్యాన్నిస్తోంది.

అయితే కథా బలం లేని సినిమాలని చైనీయులు ఆదరించడం లేదు. ఇంతకుముందు ఇక్కడ విజయం సాధించిన ఇండియన్‌ సినిమాలన్నీ ఎమోషనల్‌ కంటెంట్‌ ఎక్కువ వున్నవే. కానీ అంధాదూన్‌ పూర్తిగా డిఫరెంట్‌ సినిమా. హాలీవుడ్‌ తరహా కాన్‌ థ్రిల్లర్‌ అయిన అంధాదూన్‌ అంతర్జాతీయ సినిమాలకి తీసిపోని కథా విలువలతో తెరకెక్కింది. ఇండియాలో కేవలం వంద కోట్ల పైచిలుకు వసూళ్లు మాత్రమే తెచ్చుకున్న ఈ చిత్రానికి చైనీయులు సింహాసనం వేసి కూర్చోబెట్టారు. దీంతో స్టార్లు లేని చిన్న సినిమాలని కూడా చైనాలో విడుదల చేయడానికి నిర్మాతలు యమ ఉత్సాహంగా ఉరకలు పెడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English