జెర్సీ టైమింగ్‌ కాస్త తేడా కొట్టింది

జెర్సీ టైమింగ్‌ కాస్త తేడా కొట్టింది

జెర్సీని ఏప్రిల్‌ 19న విడుదల చేయాలనేది సినిమా మొదలైనపుడు తీసుకున్న నిర్ణయం. అయితే ఆ తర్వాత ఏప్రిల్‌ 5న విడుదల చేయాలని భావించారు. కానీ తర్వాత మళ్లీ ముందు అనుకున్న డేట్‌కే మార్చారు. అయితే ఏప్రిల్‌ 5న విడుదలయి వుంటే ఈ చిత్రానికి చాలా ప్లస్‌ అయ్యేది. చాలా కాలం గ్యాప్‌ తర్వాత వచ్చిన సినిమా కావడంతో సహజంగానే జనం బారులు తీరేవారు. మజిలీ అదే డేట్‌కి వచ్చి ఎంత లాభపడిందనేది తెలిసిందే. ఏప్రిల్‌ 5న రిలీజ్‌ అయినట్టయితే మార్కెట్లో ఇది తప్ప మరో ఆప్షన్‌ వుండేది కాదు.

కానీ ఏప్రిల్‌ 19కి వచ్చేసరికి మజిలీ, చిత్రలహరి ఆల్రెడీ మార్కెట్లో వుండగా, కాంచన 3తో డైరెక్ట్‌ క్లాష్‌ ఏర్పడింది. కాంచన 3 ఈ చిత్రం వసూళ్లని ఎలా తినేస్తోందనేది కనిపిస్తూనే వుంది. జెర్సీ విజయానికి ఇప్పటికీ ఢోకా లేకపోయినా కానీ ఈ సినిమాకి వచ్చిన టాక్‌కి పోటీ లేకపోయినట్టయితే వసూళ్లు ఇంకా బ్రహ్మాండంగా వుండేవి. నాని కెరియర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన ఎంసిఏ వసూళ్లని దాటినా ఆశ్చర్యం లేకపోయేది. ఓవర్సీస్‌లో కూడా ఫస్ట్‌ ఇన్‌ అడ్వాంటేజ్‌ని క్యాష్‌ చేసుకుని ఘనమైన వసూళ్లని రాబట్టుకుని వుండేది. ఇప్పుడు రెండవ వారంలో అవెంజర్స్‌ వల్ల ఓవర్సీస్‌ బిజినెస్‌ అంతగా వుండకపోవచ్చుననేది ట్రేడ్‌ అంచనా.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English