అక్కినేని వారి కోడలా మజాకా!

అక్కినేని వారి కోడలా మజాకా!

సమంత సూపర్‌ టాలెంటెడ్‌ అనేది గతంలో పలుమార్లు తెలిపిన చిత్రాలున్నాయి కానీ ఎక్కువగా హీరోల చాటు హీరోయిన్‌గానే మిగిలిపోయింది. పెళ్లయిన తర్వాత అగ్ర హీరోలు తనతో నటించడానికి ఆసక్తిగా లేకపోవడంతో ప్రస్తుతం తన ఇష్టానికి తగ్గ పాత్రల్లో సమంత నటిస్తోంది. సోలోగా సినిమాని పుల్‌ చేసేంత స్టామినా వుందో లేదో అనేది ఇంకా తెలియలేదు కానీ యువ హీరోల పక్కన సమంత వుంటే సదరు చిత్రానికి డీసెంట్‌ క్రేజ్‌ వస్తుంది. మజిలీతో మగడికి అతి పెద్ద విజయాన్ని అందించడంలో సమంత కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం చూసిన వారిలో ఎవరైనా సమంత పేరు ప్రస్తావించకుండా వుండలేరు.

ఇంకా చెప్పాలంటే ఈ చిత్రాన్ని ఆమె ఒంటి చేత్తో నిలబెట్టేసింది. ఈ సంగతి సమంతకి కూడా తెలుసు. అందుకేనేమో మజిలీ తర్వాత పారితోషికం పెంచాలని నిర్ణయించుకుంది. ఇకపై భారీ చిత్రాల్లో నటించే వీల్లేదు కనుక, వచ్చిన చిత్రాల్లోనే తన స్థాయికి తగ్గ పారితోషికం తీసుకోవాలనుకుంటోంది. సమంత ఇకనుంచి రెండున్నర కోట్లు తీసుకునే ఆలోచనలో వుందని, ఇప్పటికే తనని సంప్రదించిన నిర్మాతలకి అదే మొత్తం చెప్పిందని వినిపిస్తోంది. నాని, సుధీర్‌బాబుతో దిల్‌ రాజు నిర్మించే చిత్రంలో ఒక కథానాయికగా సమంతని అనుకుని కూడా ఆమె అడిగిన పారితోషికానికి జడిసి వద్దనుకున్నారట. అక్కినేని వారి కోడలా మజాకా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English