జెర్సీ.. భయపడాల్సిన పని లేదు

జెర్సీ.. భయపడాల్సిన పని లేదు

జెర్సీ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే వసూళ్ల మోత మోగిపోయి ఉండాలి. కానీ అవి ఆశించిన స్థాయిలో లేవు. తొలి వారాంతంలో వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి రూ.14 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు అంచనా. మామూలుగా చూస్తే ఓకే కానీ.. టాక్‌ను బట్టి ఇంకా మెరుగైన వసూళ్లు వచ్చి ఉండాలి. వీకెండ్లో కూడా ఈ చిత్రానికి చాలా చోట్ల ఫుల్స్ పడలేదు. ‘కాంఛన-3’ పోటీ కారణంగా మాస్ సెంటర్లలో దెబ్బ బాగానే పడింది. వీకెండ్ తర్వాత వసూళ్లలో డ్రాప్ బాగానే కనిపిస్తోంది. ముఖ్యంగా బి, సి సెంటర్లలోనే సినిమాకు ఇబ్బంది ఉంది. మరి ఈ చిత్రంపై రూ.27 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన బయ్యర్ల పరిస్థితి ఏంటి అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే ‘జెర్సీ’ వసూళ్ల గురించి మరీ టెన్షన్ పడాల్సిన పని లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

రెండో వారంలో ఈ చిత్రానికి తెలుగులో మరే సినిమా నుంచి పోటీ లేదు. ఈ వారం రావాల్సిన ‘సీత’ వాయిదా పడింది. మరే సినిమా కూడా రిలీజ్ కావట్లేదు. హాలీవుడ్ సినిమా ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ నుంచి పోటీ ఉంటుంది కానీ.. దాని టార్గెటెడ్ ఆడియన్స్ వేరు. రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు చూసే ఆడియన్స్‌కు ఫస్ట్ ఛాయిస్ ‘జెర్సీ’నే అవుతుంది. యూత్, ఫ్యామిలీస్ ఈ సినిమాకు బాగానే తరలి వచ్చే అవకాశముంది. రెండో వీకెండ్లో తొలి వారాంతానికి దీటుగా వసూళ్లు రాబట్టే అవకాశాలున్నాయి. ‘కాంఛన-3’ ఎక్కువ రోజు నిలబడే అవకాశాలు కనిపించట్లేదు. రెండో వారాంతంలో ఒక ఏడెనిమిది కోట్ల షేర్ రాబట్టగలిగితే ఈ సినిమా బాక్సాఫీస్ గండాన్ని దాటేసినట్లే. మే 9న ‘మహర్షి’ వచ్చేవరకు ‘జెర్సీ’ థియేటర్లలో కొనసాగుతూ మంచి వసూళ్లు రాబట్టడానికి అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English