'మహర్షి'ని దారుణంగా దెబ్బ కొడుతున్నాడు!

'మహర్షి'ని దారుణంగా దెబ్బ కొడుతున్నాడు!

మహేష్‌ చిత్రాలకి దేవిశ్రీప్రసాద్‌ అదిరిపోయే ఆల్బమ్స్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం రెండయినా చార్ట్‌బస్టర్‌ సాంగ్స్‌ ఇచ్చేవాడు. శ్రీమంతుడు, 1 నేనొక్కడినే, భరత్‌ అనే నేను లాంటి చిత్రాల్లో దేవి కొన్ని సూపర్‌ సాంగ్స్‌ కంపోజ్‌ చేసాడు. భరత్‌ అనే నేనులో టైటిల్‌ సాంగ్‌, వచ్చాడయ్యో సామి సినిమా రేంజ్‌ని పెంచేసాయి. అయితే మహర్షికి వచ్చేసరికి దేవి ఇంతవరకు తన సిగ్నేచర్‌ సాంగ్‌ ఒక్కటీ ఇవ్వలేదు. మొదటి రెండు పాటలు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాక మూడవ దానికి సరాసరి వీడియో రిలీజ్‌ చేసారు.

ఎవరెస్ట్‌ అంచున అంటూ సాగే ఈ వెస్ట్రన్‌ స్టయిల్‌ సాంగ్‌లో బీట్స్‌ బాగున్నా ట్యూన్‌ చాలా ఆర్డినరీగా వుంది. విజువల్స్‌ కూడా అంతంతమాత్రంగానే అనిపిస్తున్నాయి. మహేష్‌ డాన్స్‌ స్టెప్స్‌ని ఆల్రెడీ ట్రోల్‌ చేస్తున్నారు కూడా. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్‌ కొడతాడని అనుకుంటూ వుంటే, ఇంతవరకు దీనిని దారుణంగా దెబ్బ కొట్టాడు. మిగిలిన రెండు పాటలయినా బాగుంటాయా లేక ఇది కూడా 'వినయ విధేయ రామ'లా మర్చిపోయే ఆల్బమ్‌గా మిగిలిపోతుందా? ఆడియో వీక్‌ అవడంతో ఇక ఈ చిత్రానికి కథ, ఇతర విలువలే ప్లస్‌ అవుతాయని భావిస్తున్నారు. టీజర్‌ నాసిరకంగా వుండడం ఫాన్స్‌ని భయపెడుతున్నా ట్రెయిలర్‌లో స్టోరీ ఏమిటనేది తెలిస్తే హైప్‌ పెరుగుతుందని ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English