చుట్టూ తిరిగి నాని కొంప ముంచాడు!

చుట్టూ తిరిగి నాని కొంప ముంచాడు!

'జెర్సీ', 'కాంచన 3' చిత్రాల మధ్య క్వాలిటీ పరంగా వ్యత్యాసం ఆకాశానికీ, నేలకీ వున్నంత వుంటుంది. అయితేనేమి... జెర్సీ ఒక క్లాసీ ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామా కాగా, కాంచన 3 మాత్రం మాస్‌ని వెర్రెత్తించే హారర్‌ కామెడీ. పాపులర్‌ ఫ్రాంచైజీకి చెందిన సినిమా కావడంతో కాంచన 3కి సరయిన ప్రమోషన్‌ కూడా అక్కర్లేకుండానే వసూళ్లు అదరగొడుతోంది. ఈ చిత్రానికి తొలి వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్లకి పైగా షేర్‌ వచ్చింది. జెర్సీ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో పదకొండు కోట్లు, ఓవరాల్‌గా పదిహేను కోట్ల షేర్‌ వచ్చింది. ఇది మంచి కలక్షనే కానీ ఒకవేళ కాంచన లేకపోతే మాత్రం ఈ వారాంతంలో జెర్సీ వసూళ్లు ఇరవై కోట్లు దాటి వుండేవి.

రెవెన్యూ రెండు సినిమాల మధ్య షేర్‌ అయిపోవడం, మాస్‌ కేంద్రాల్లో కాంచన 3 డామినేట్‌ చేయడంతో జెర్సీకి రావాల్సిన వసూళ్లకి గండి కొట్టినట్టయింది. కాంచన 3 చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై ముందుగా లారెన్స్‌కి క్లారిటీ లేదు. చాలా డేట్స్‌ అనౌన్స్‌ చేసి చివరకు ఏప్రిల్‌ 19న విడుదల చేసారు. జెర్సీని ఆ డేట్‌నుంచి మార్చడానికి ఆ చిత్ర నిర్మాతలు ఇష్టపడలేదు. దీంతో మజిలీ, చిత్రలహరి చిత్రాలకి వచ్చిన సోలో వీకెండ్‌ అదృష్టం జెర్సీకి దక్కలేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English