మొట్ట మొదటి 20 వేల కోట్ల సినిమా ఇదేనా?

మొట్ట మొదటి 20 వేల కోట్ల సినిమా ఇదేనా?

3 బిలియన్ డాలర్లు.. అంటే అక్షరాలా రూ.20 వేల కోట్ల రూపాయలకు పైమాటే. ఒక సినిమా ఇంత వసూళ్లు సాధిస్తుందని అంటే నమ్మశక్యంగా అనిపించదు. కానీ ఈ శుక్రవారం రాబోతున్న ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సినిమా ఆ మైలురాయిని అందుకుంటుందని ప్రపంచ సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 3 బిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిన తొలి సినిమాగా ‘ఎండ్ గేమ్’ చరిత్ర సృష్టిస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు.

ఎక్కడో హాలీవుడ్లో తెరకెక్కిన సినిమాకు ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్న తీరు చూస్తే ఈ అంచనా నిజమే అనిపిస్తోంది. హిందీలో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలు.. మన దగ్గర పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాలు.. తమిళంలో విజయ్, అజిత్‌ల చిత్రాలు రిలీజైతే ఎలా టికెట్ల కోసం ఎగబడతారో ‘ఎండ్ గేమ్’ టికెట్ల కోసం అలాగే తపించిపోతున్నారు జనాలు. ఇలా టికెట్లు పెట్టడం ఆలస్యం అలా అయిపోతున్నాయి. తొలి వారాంతానికి మల్టీప్లెక్సుల్లో ఎక్కడా టికెట్లు దొరికే పరిస్థితి లేదు.

దేశవ్యాప్తంగా ఇదే క్రేజ్ నెలకొంది. ఇండియాలోనే వందల కోట్ల వసూళ్లు ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విపరీతమైన హైప్ మధ్య సినిమా రిలీజవుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరి దృష్టీ దీని మీదే ఉంది. ఇంతకుముందు ‘ఎవెంజర్స్’ సిరీస్‌లో వచ్చిన ‘ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.

‘అవతార్’ సినిమా 2.7 బిలియన్ డాలర్లు.. అంటే రూ.18,800 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి అగ్ర స్థానంలో కొనసాగుతోంది. దాని రికార్డుల్ని ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ కచ్చితంగా బద్దలు కొడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ‘అవతార్’కు ఏమాత్రం తగ్గని స్తాయిలో క్రేజ్ ఉండగా.. ఇప్పుడు టికెట్ల రేట్లు పెరిగాయి కాబట్టి ఆ వసూళ్లు దాటి తొలి 3 బిలియన్ డాలర్ల సినిమాగా ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ నిలవడం ఖాయం అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English