రాజమౌళిని ఎయిర్‌పోర్ట్‌లో పడేసిందట

 రాజమౌళిని ఎయిర్‌పోర్ట్‌లో పడేసిందట

‘బాహుబలి’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో నటించాలని ఆశపడిన నటీనటులు ఎంతోమంది. బాలీవుడ్ ఆర్టిస్టులు సైతం జక్కన్నతో పని చేయడానికి తహతహలాడారు. ఐతే హిందీ నుంచి అజయ్ దేవగణ్, ఆలియా భట్ మాత్రమే ఈ అవకాశం దక్కించుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో వీళ్లిద్దరూ కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ చేస్తున్నది స్పెషల్ క్యారెక్టర్. దాని నిడివి అరగంటే.

ఐతే ఆలియా మాత్రం ఫుల్ లెంగ్త్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోంది. దీంతో ఆలియా అదృష్టమే అదృష్టం అని అంతా అంటున్నారు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’లో నీకెలా అవకాశం వచ్చింది అని అడిగితే.. తానే జక్కన్నతో ఈ సినిమాలో అవకాశం కోసం అడిగి ఆయన్ని ఈ దిశగా ఆలోచించేలా చేశానని అంటోంది ఆలియా.

‘బాహుబలి’ చూశాక రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని తానెంతగానో కోరుకున్నట్లు ఆలియా చెప్పింది. ఆ తర్వాత ఒకసారి రాజమౌళి ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కలవగా.. మొహమాట పడకుండా తన మనసులోని కోరిక చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ సినిమా కోసం ఏం చేయడానికైనా రెడీ అని, డేట్లు కూడా ఎలా అయినా సర్దుబాటు చేస్తానని.. తప్పకుండా తనకు అవకాశం ఇవ్వాలని తాను జక్కన్నను అడిగినట్లు ఆలియా చెప్పింది. అప్పటికి ‘ఆర్ఆర్ఆర్’ గురించి తనకు ఏమీ తెలియదని.. ఆ చిత్రానికి కథానాయికగా కూడా రాజమౌళి ఎవరినీ అనుకుని ఉండకపోవచ్చని ఆలియా తెలిపింది.

ఐతే తాను అడగడం వల్ల ఆలోచించాడో లేక ముందే రాజమౌళి మనసులో తన గురించి ఆలోచన ఉందో తెలియదు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’లో నటించే అద్భుత అవకాశాన్ని తనకు కల్పించాడని ఆమె చెప్పింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నానని, ఎప్పుడెప్పుడో ఈ చిత్రంలో నటిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆలియా ఉద్వేగంగా

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English