జెర్సీ ఇలా.. కాంఛన-3 అలా

జెర్సీ ఇలా.. కాంఛన-3 అలా

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకున్న సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతుండగా.. పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఏమో అదరగొడుతోంది. గత శుక్రవారం విడుదలైన ‘జెర్సీ’, ‘కాంఛన-3’ సినిమాల పరిస్థితి ఇది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’కి ఎంత మంచి టాక్ వచ్చిందో తెలిసిందే.

తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఇదే అనడంలో మరో మాట లేదు. మామూలుగా చూసినా ఇది గొప్ప సినిమానే. చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అన్నారు. సెలబ్రెటీలతో పాటు సామాన్య ప్రేక్షకులూ ఈ సినిమాను పొగుడుతున్నారు. సమీక్షకులు టాప్ రేటింగ్స్ ఇచ్చారు. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తుందని అంచనా వేశారు. కానీ అలా ఏమీ జరగలేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లో రూ.11 కోట్ల లోపే షేర్ రాబట్టింది. మామూలుగా చూస్తే ఇవి మంచి వసూళ్లే కానీ.. ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే తక్కువే. డివైడ్ టాక్ తెచ్చుకున్న నాని సినిమా ‘ఎంసీఏ’కు తొలి వారాంతంలో దీని కంటే ఒక 40 శాతం ఎక్కువే వసూళ్లు వచ్చాయి. పూర్తి క్లాస్ సినిమా కావడంతో మాస్ సెంటర్లలో దీనికి పంచ్ పడినట్లు కనిపిస్తోంది. అక్కడ ‘కాంఛన-3’ దుమ్ము దులుపుతోంది. దానికి పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. సమీక్షలూ నెగెటివే. ఐతే టాక్‌తో సంబంధం లేకుండా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.

తొలి వీకెండ్లో ‘కాంఛన-3’ తెలుగు వెర్షన్ రూ.9 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. ఒక డబ్బింగ్ సినిమా.. అందునా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రానికి ఈ వసూళ్లు అనూహ్యం. మరోవైపు తమిళంలో కూడా ఈ చిత్రం అదరగొడుతోంది. వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ గ్రాస్ రూ.40 కోట్లకు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. మరి వీకెండ్ తర్వాత ‘జెర్సీ’, కాంఛన-3’ ఎలాంటి వసూళ్లతో సాగుతాయో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English