ఎండ్ గేమ్.. ఈ క్రేజ్ ఏంటి బాబోయ్

ఎండ్ గేమ్.. ఈ క్రేజ్ ఏంటి బాబోయ్

ఒకప్పుడు హాలీవుడ్లో ఒక సినిమా విడుదలై పెద్ద హిట్టయి.. దాని గురించి మీడియాలో పెద్ద చర్చ నడిచాక కొన్ని నెలలకు ఇండియాలో రిలీజయ్యేది. అంత కాలం జనాలు ఉత్కంఠగా ఎదురు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు నేరుగా మిగతా దేశాలతో పాటే ఇండియాలోనూ హాలీవుడ్ సినిమాలు రిలీజవుతున్నాయి. కొన్నిసార్లు వారం రెండు వారాల ముందే సినిమాను ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు.

వచ్చే శుక్రవారం ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో.. అత్యధిక దేశాల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఇండియాలోనూ ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూసి మతిపోతోంది. ఇండియాలో ఆయా భాషల సూపర్ స్టార్ల సినిమాల రిలీజ్ టైంలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో దీనికి అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

‘బుక్ మై షో’లో ఇలా టికెట్లు పెట్టడం.. అలా అవి సేల్ అయిపోవడం కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని మెజారిటీ మల్టీప్లెక్స్లుల్లో టికెట్లు ఓపెన్ చేయగా.. నిమిషాల్లో ‘సౌల్డ్ ఔట్’ బోర్డు పడిపోయింది. పెట్టిన షోలు పెట్టినట్లే అమ్ముడు పోయే పరిస్థితి కనిపిస్తోంది. మల్టీప్లెక్సుల్లో అయితే తొలి వారాంతానికి టికెట్లు బుక్ చేయడం చాలా కష్టంగా ఉంది. సింగిల్ స్క్రీన్ల మీదే ఆశలు పెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

గతంలో ‘అవతార్’.. ‘ఏవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ సినిమాలకు ఇలాంటి క్రేజే ఉంది కానీ.. ‘ఎండ్ గేమ్’కైతే క్రేజ్ పతాక స్థాయికి చేరుకుంది. ‘ఎవెంజర్స్’ సిరీస్‌లో వస్తున్న చివరి సినిమా ఇదే కావడంతో హైప్ డబులైంది. బుకింగ్స్ ఇలా ఉన్నాయంటే ఇక వసూళ్లు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చు. ఇండియాలో హాలీవుడ్ సినిమాల వసూళ్ల రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టేస్తుందనడంలో మరో మాట లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English