వాళ్లు ఓకే అన్నారు.. రీమేక్‌లో నటిస్తున్నాడు

వాళ్లు ఓకే అన్నారు.. రీమేక్‌లో నటిస్తున్నాడు

గత ఏడాది బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిత్ర ‘అంధాదున్’. ఆయుష్మాన్ ఖురాన్ లాంటి చిన్న హీరోను పెట్టి శ్రీరామ్ రాఘవన్ తీసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అద్భుత విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో నిరుడు బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. వసూళ్ల సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో కథాకథనాలు.. నటీనటుల పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇందులో హీరోది అంధుడి పాత్ర కావడం విశేషం. అలాగని ఇదేమీ ట్రాజిక్ మూవీ కాదు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిపోతుంది. హీరో పాత్రలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ చిత్రాన్ని దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు వెర్షన్ సంగతి తేలలేదు కానీ.. తమిళ రీమేక్ మాత్రం కన్ఫమ్ అయింది.

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సిద్ధార్థ్ ‘అంధాదున్’ తమిళ రీమేక్‌లో హీరోగా నటించబోతున్నాడు. ఇందులో త్రిష అతడికి జోడీగా నటించనుంది. హిందీలో రాధికా ఆప్టే చేసిన క్యారెక్టర్లో త్రిష కనిపిస్తుందట. మరి ‘అంధాదున్’లో అత్యంత కీలకమైన టబు పాత్రను ఇక్కడ ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. సిద్ధు ఈ సినిమా రీమేక్ గురించి కొన్ని నెలల కిందటే సంకేతాలిచ్చాడు.

‘అంధాదున్’ రీమేక్‌లో తాను నటిస్తే బాగుంటుందని అంటున్నారని.. మీరేమంటారో చెప్పాలంటూ అతను ఆ మధ్య తన ట్విట్టర్ ఫాలోవర్లను అడిగాడు. మెజారిటీ ఫాలోవర్లు అతడిని ప్రోత్సహించడంతో వారి మాట మన్నించి సినిమా చేస్తున్నాడట. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. తెలుగు రీమేక్ కూడా త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు. మరోవైపు ‘అంధాదున్’ ఇటీవలే చైనాలో విడుదలై ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English