సునీల్ ప్రాణం కాపాడిన చిరు

సునీల్ ప్రాణం కాపాడిన చిరు

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తమకు లైఫ్ ఇచ్చాడని చాలామంది చెబుతుంటారు. కానీ ఆయన నిజంగా తన లైఫే కాపాడాడని అంటున్నాడు కమెడియన్ కమ్ హీరో సునీల్. తాను సినిమాల్లోకి రావడానికి ఇన్‌స్పిరేషన్ చిరునే అని పలు సందర్భాల్లో సునీల్ చెప్పాడు. చిరు మీద అభిమానాన్ని అతనెప్పుడూ దాచుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ఒకప్పుడు చిరు చెప్పిన మాటతో తన ప్రాణం ఎలా నిలబడిందో వివరించాడు సునీల్.

చిరుతో కలిసి ‘ఠాగూర్’ సినిమాలో నటించే సమయంలో ఒక రోజు షూటింగ్ అయ్యాక భీమవరం వెళ్లేందుకు బయల్దేరానని, ఇదే విషయం చిరుకు చెబితే.. సీటు బెల్టు పెట్టుకోవడం మరిచిపోవద్దు అని హెచ్చరించినట్లు సునీల్ తెలిపాడు. ఆ రోజు ప్రయాణంలో కారుకు యాక్సిడెంట్ అయి నాలుగు పల్టీలు కొట్టిందని.. ఆ రోజు చిరు హెచ్చరిక వల్ల సీటు బెల్టు పెట్టుకున్నాను కాబట్టి సరిపోయిందని.. లేకపోతే ప్రాణాలు పోయేవని.. ఆ రకంగా చిరునే తన ప్రాణాలు కాపాడాడని అనుకోవచ్చిన సునీల్ తెలిపాడు.

మామూలుగా చూస్తే తన జీవితంలో ప్రమాదాలు చాలా సాధారణం అయిపోయాయని.. ఎన్నోసార్లు యాక్సిడెంట్లయినా తాను ప్రాణాలతో బయటపడ్డానని సునీల్ చెప్పాడు. ‘నువ్వే కావాలి’ సినిమా సమయంలో కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పినట్లు అతను తెలిపాడు. కొన్ని సందర్భాల్లో తాను చనిపోయినట్లు కూడా టీవీ ఛానెళ్లలో వార్తలొచ్చాయన్నాడు. తాను ఆసుపత్రిలో కళ్లు తెరిచిన ప్రతిసారీ కళ్ల ముందు తన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండేవాడని సునీల్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English