‘జెర్సీ’ ఎలా పుట్టిందంటే..?

‘జెర్సీ’ ఎలా పుట్టిందంటే..?

ఏ సినిమా ఆలోచన ఎప్పుడు.. ఎలా పుడుతుందో చెప్పలేం. పేపర్లో ఒక వార్త చదువుతున్నపుడు ఆలోచన రావచ్చు. ఒక వ్యక్తిని కలిసినపుడు ఐడియా పుట్టొచ్చు. వేరే సినిమా చూస్తున్నపుడు కూడా రావచ్చు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘జెర్సీ’ సినిమా ఐడియా పుట్టడానికి ఒక ప్రెస్ మీట్ కారణం అంటున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఆ ప్రెస్ మీట్ ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లెదట.

దీని వెనుక కథేంటో గౌతమ్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.  ‘‘చాలా ఏళ్ల కిందట హైద‌రాబాద్‌లో ఓ ప్రెస్‌మీట్‌కు హాజరైన హర్ష భోగ్లె.. స‌చిన్ టెండూల్క‌ర్ గురించి హ‌ర్ష బోగ్లే మాట్లాడుతూ అతడి కన్నా గొప్ప ఆట‌గాళ్లు చాలా మంది ఉన్నా కూడా తన యాటిట్యూడ్ కార‌ణంగానే స‌చిన్ గొప్ప‌వాడైయ్యాడ‌ని అన్నాడు. అంటే సచిన్ లాగా.. సచిన్ కన్నా టాలెంట్ ఉన్నవాళ్లు చాలా మంది ఉంటారు క‌దా అనే పాయింట్ బాగా న‌చ్చింది. సాధార‌ణంగా మ‌నం స‌క్సెస్ అయిన వాళ్ల‌నే గుర్తు పెట్టుకుంటాం. కానీ అంతే క‌ష్ట‌ప‌డి వేర్వేరు కార‌ణాల‌తో ల‌క్ష్యాన్ని చేరుకోని వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారి గురించి చెప్పాలనిపించింది. ఆలా ‘జెర్సీ’ కథను త‌యారు చేసుకున్నాను’’ అని గౌతమ్ తెలిపాడు.

తన తొలి సినిమా ‘మళ్ళీ రావా’ కంటే ముందే ‘జెర్సీ’ స్క్రిప్టు రెడీ చేసుకున్నట్లు గౌతమ్ చెప్పడం విశేషం. తన ద‌గ్గ‌రున్న కథల్లో అత్యంత ఇష్టమైనది కూడా ‘జెర్సీ’నే అని.. ఐతే ఒక కొత్త దర్శకుడిని నమ్మి ఇలాంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చేయడానికి ముందుకు రారని ఎవ‌రినీ అప్రోచ్ కూడా కాలేదని గౌతమ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English